NBK107: సంక్రాంతి బరి నుండి బాలయ్య వెనకుడుగు వేస్తాడా..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK107 పేరుతో ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా సంక్రాంతి బరిలో రావడం కష్టమే అంటున్నారు సినీ అభిమానులు.

NBK107: సంక్రాంతి బరి నుండి బాలయ్య వెనకుడుగు వేస్తాడా..?

Balakrishna NBK107 Movie To Get Out Of Sankranti Race

Updated On : October 8, 2022 / 9:20 AM IST

NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK107 పేరుతో ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

NBK107: భారీ రేటుకు అమ్ముడైన బాలయ్య సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్..?

కాగా, ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా సంక్రాంతి బరిలో రావడం కష్టమే అంటున్నారు సినీ అభిమానులు. ఇప్పటికే సంక్రాంతి బరిలో మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ కావడమే దీనికి కారణంగా వారు చెబుతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆదిపురుష్’ చిత్రం ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ కోసం రెడీ అయ్యింది. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 154 సినిమా కూడా సంక్రాంతి రిలీజ్‌గా రానుంది.

BalaKrishna: NBK107 సెట్ లో నందమూరి మోక్షజ్ఞ.. అందుకోసమేనా!

ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో ఉండటంతో, బాలయ్య సినిమాను సంక్రాంతి పోటీ నుండి తప్పించాలని చిత్ర యూనిట్ భావిస్తోన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాను సంక్రాంతి కంటే ముందే రిలీజ్ చేస్తారా లేక, సంక్రాంతి తరువాత రిలీజ్ చేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుండగా అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.