Balakrishna : విశ్వ‌క్‌సేన్‌కు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన బాల‌య్య‌..

మాస్‌కా దాస్ విశ్వ‌క్ సేన్ (Vishwak Sen) కు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ (Balakrishna) స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. విశ్వ‌క్ న‌టిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి (Gangs Of Godavari).

Balakrishna : విశ్వ‌క్‌సేన్‌కు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన బాల‌య్య‌..

Balakrishna - Vishwak Sen

Updated On : September 2, 2023 / 9:53 PM IST

Balakrishna – Vishwak Sen : మాస్‌కా దాస్ విశ్వ‌క్ సేన్ (Vishwak Sen) కు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ (Balakrishna) స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. విశ్వ‌క్ న‌టిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి (Gangs Of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నేహా శెట్టి క‌థానాయిక‌. అంజలి కీలక పాత్రలో న‌టిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే.. ఈ చిత్ర షూటింగ్ సెట్స్‌ను బాల‌కృష్ణ సంద‌ర్శించారు. ఈ విష‌యాన్ని విశ్వ‌క్ స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశారు.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’

‘మా సినిమా సెట్‌లో నాకు బాల‌య్య గారు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. నన్ను ఎంత‌గానో స‌పోర్టు చేస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు సార్‌. ఎప్ప‌టికీ మిమ్మ‌ల్ని ప్రేమిస్తూనే ఉంటాను. మీరు రావ‌డంతో మా చిత్ర బృందంలో సంతోషం నెల‌కొంది. కానీ సినిమాలోని నా లుక్ రివీల్ కాకూద‌నే కార‌ణంతో అన్ని ఫోటోల‌ను పోస్ట్ చేయ‌లేక‌పోతున్నాను. అయితే.. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం త‌ప్ప‌కుండా అన్ని ఫోటోలు, వీడియోల‌ను పోస్ట్ చేస్తాను. అంత వ‌ర‌కు ఫ్రేమ్‌లో ఉన్న బాల‌య్య బాబు చాలు.. ఫైర్ అంతే.’ అని విశ్వ‌క్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

Thrigun : పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న టాలీవుడ్ యంగ్ హీరో.. రేపే వెడ్డింగ్‌..

అటు బాల‌కృష్ణ న‌టిస్తున్న చిత్రం ‘భ‌గ‌వంత్ కేస‌రి’. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్‌ (Kajal Aggarwal) హీరోయిన్‌గా, శ్రీలీల (Sreeleela) బాలయ్య కూతురిగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal) విలన్‌గా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)