Bellamkonda Sreenivas : బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో.. మళ్ళీ లైన్లోకి వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్..
యూట్యూబ్ లో తన యాక్షన్ సినిమాలతో ప్రపంచ రికార్డులని సృష్టించిన బెల్లంకొండ శ్రీనివాస్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో రాబోతున్నాడు.

Bellamkonda Sreenivas Come Back with Action Films back to back Ugadi Special Post goes Viral
Bellamkonda Sreenivas : అల్లుడు శీనుతో మంచి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తర్వాత చాలా వరకు యాక్షన్ సినిమాలతోనే ప్రేక్షకులని పలకరించాడు. తెలుగులో చివరగా 2021 లో అల్లుడు అదుర్స్ సినిమాతో పర్వాలేదనిపించారు. అప్పట్నుంచి మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు. మధ్యలో బాలీవుడ్ కి వెళ్లి ఛత్రపతి సినిమా చేసినా అది అంతగా ఫలితం ఇవ్వలేదు.
యూట్యూబ్ లో తన యాక్షన్ సినిమాలతో ప్రపంచ రికార్డులని సృష్టించిన బెల్లంకొండ శ్రీనివాస్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో రాబోతున్నాడు. ఇటీవల టైసన్ నాయుడు అనే సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చెశారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు.
Also Read : Niharika Konidela : నిహారిక నిర్మాతగా.. ఏకంగా ఇరవై మందికి పైగా కొత్తవాళ్లతో సినిమా.. ‘కమిటీ కుర్రాళ్ళు’
తాజాగా నేడు బెల్లంకొండ శ్రీనివాస్ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ తన నెక్స్ట్ సినిమాల గురించి ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తన పోస్ట్ లో.. మీ అందరినీ కలిసి చాలా రోజులయ్యింది. ఈ సమయంలో ప్రొఫెషనల్ లైఫ్ పరంగా బెస్ట్ ఇవ్వడానికి నన్ను నేను మలుచుకుంటూ వచ్చాను. ఇలాంటి సమయాలలో కూడా నాకు తోడుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. నేను నటించిన చివరి తెలుగు సినిమా తెరపైకి వచ్చి మూడేళ్లు అవుతోంది. ఈ క్రమంలో ఈ నూతన సంవత్సరం మరోసారి మంచి సినిమాలతో మీ ముందుకు రావడానికి నేను సిద్ధం అవుతున్నాను. నేను నటిస్తున్న తదుపరి సినిమా, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ‘టైసన్ నాయుడు’ ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా తర్వాత షైన్ స్క్రీన్స్ తో ఒక సినిమా, మూన్లైన్ పిక్చర్స్ తో ఒక సినిమా చేయబోతున్నాను. ఈ సినిమాల గురించి మరిన్ని వివరాలు నేను త్వరలోనే తెలుపుతాను. త్వరలోనే మీ అందరినీ థియేటర్లలో కలుస్తాను అని తెలిపాడు.
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
Wishing you all a #HappyUgadi
See you all at theatres soon! pic.twitter.com/K2N6Efg1qD
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) April 9, 2024