Bigg Boss 7 Day 16 : రతిక వర్సెస్ యావర్, ప్రశాంత్.. హౌస్ అంతా కుట్రల మయం..
ఇప్పటికే రెండు పవరాస్త్రలు ఇచ్చిన బిగ్‌బాస్ తాజాగా మూడో పవరాస్త్ర కోసం టాస్కులు మొదలు పెట్టాడు. తానే ఓ ముగ్గుర్ని సెలెక్ట్ చేశాను అంటూ అమర్ దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ పేర్లు చెప్పగా మిగిలిన వాళ్ళు ఫీల్ అయ్యారు.

Bigg Boss 7 Day 16 episode highlights Prashanth Rathika Prince Yavar fires
Bigg Boss 7 Day 16 : సోమవారం నామినేషన్స్ హడావిడి అయ్యాక నిన్న మంగళవారం నుంచి గేమ్ లో పడ్డారు కంటెస్టెంట్స్. ఇక ఈ ఎపిసోడ్ లో రతిక, ప్రశాంత్, ప్రిన్స్ యావర్ హైలెట్ అయ్యారు. రతిక తన మాజీ బాయ్ ఫ్రెండ్ ని గుర్తు చేస్తున్నారని శివాజితో చెప్పి బాధపడింది. అనంతరం హౌస్ లో అందరూ కలిసి వినాయకచవితి చేసుకున్నారు. ప్రసాదాలు వండుకొని తిన్నారు.
ఇప్పటికే రెండు పవరాస్త్రలు ఇచ్చిన బిగ్‌బాస్ తాజాగా మూడో పవరాస్త్ర కోసం టాస్కులు మొదలు పెట్టాడు. తానే ఓ ముగ్గుర్ని సెలెక్ట్ చేశాను అంటూ అమర్ దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ పేర్లు చెప్పగా మిగిలిన వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇక ప్రశాంత్ అయితే నేను ఓడిపోయా అంటూ హడావిడి చేస్తూ తెగ బాధపడ్డాడు. దీంతో ప్రశాంత్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి పవరాస్త్ర కోసం నేను సెలెక్ట్ చేసిన ముగ్గురిలో అనర్హులు ఎవరో చెప్పమన్నాడు బిగ్‌బాస్. అలాగే ఇప్పటికే పవరాస్త్ర గెలుచుకున్న శివాజీ, సందీప్, ఇప్పుడు సెలెక్ట్ చేసిన ముగ్గురు కాకుండా మిగిలిన వాళ్ళందరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిపించిన బిగ్‌బాస్ ఇప్పుడు సెలెక్ట్ చేసిన ముగ్గురిలో అనర్హులు ఎవరో చెప్పమన్నాడు.
దీంతో ప్రశాంత్.. శోభాశెట్టి అనర్హురాలు అని చెప్పాడు. ఇక మిగిలిన వాళ్లలో ప్రియాంక.. అమర్ దీప్, శుభశ్రీ.. శోభాశెట్టి, తేజ.. యావర్, దామిని.. యావర్, గౌతమ్.. శోభాశెట్టి, రతిక.. యావర్ పేర్లను చెప్పారు. అనంతరం వీళ్ళు చెప్పిన మాటలని రికార్డ్ చేసి బిగ్‌బాస్ ఇంట్లో వాళ్లందరికీ ఆ వీడియోలు ప్లే చేసి చూపించడంతో అంతా షాక్ అయ్యారు. దీంతో మొత్తం అందరి మధ్యలో గొడవలు పెట్టేశాడు బిగ్‌బాస్. యావర్ అయితే కోపంతో ఊగిపోయాడు, అరుస్తూ.. బల్లని కొడుతూ హడావిడి చేశాడు. రతిక తనని వెన్నుపోటు పొడిచిందని గొడవ పెట్టుకున్నాడు.
Bigg Boss 7 : రైతుబిడ్డ ప్రశాంత్‌కు రతిక వార్నింగ్.. చేయి వేసావంటే మర్యాదగా ఉండదు చెబుతున్నా..
ఇక మరోవైపు శివాజీ పవరాస్త్రని అమర్ దీప్ దొంగతనం చేశాడు. శివాజీ ఎవరు తీశారు అని కనుక్కునే ప్రాసెస్ లో రతిక.. ప్రశాంత్ తీసాడేమో అని అతనితో గొడవ పెట్టుకుంది. దీంతో ప్రశాంత్ – రతికల మధ్య వాగ్వాదం ఎక్కువైంది. ప్రశాంత్.. రతికని టచ్ చేస్తూ మాట్లాడటంతో రతిక మరింత ఫైర్ అయి ప్రశాంత్ ని తిట్టేసింది. ఇలా మంగళవారం ఎపిసోడ్ అంతా ప్రశాంత్ – రతిక – యావర్ ల మధ్య గొడవలతో పూర్తయింది.