Inaya Sulthana : ప్రియుడ్ని పరిచయం చేస్తూ.. పర్సనల్ ఫొటోలు షేర్ చేసిన బిగ్‌బాస్ భామ..
గౌతమ్ కొప్పిశెట్టి అనే జిమ్, యోగా ట్రైనర్ తో కలిసి ఇనయ సుల్తానా గోవాలో ఎంజాయ్ చేస్తూ ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

Bigg Boss Fame Inaya Sulthana Introduce her Boy Friend and shares Photos Videos
Inaya Sulthana : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా వచ్చిన ఇనయ సుల్తానా గుర్తు ఉండే ఉంటుంది. పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇనయ నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి ఈ భామ ఒక పార్టీలో డాన్స్ చేయగా ఆ వీడియో వైరల్ అయింది. ఇంకేముందు ఇనయ సుల్తానా ఆ వీడియోతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ పాపులారిటీతో బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
బిగ్‌బాస్ తో తన ఫాలోయింగ్, ఫేమ్ పెంచుకొని హీరోయిన్ గా చిన్న సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫొటోలు పోస్ట్ చేసే ఇనయ సుల్తానా నిన్నటినుంచి వరుసగా ఒక అబ్బాయితో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంది. గౌతమ్ కొప్పిశెట్టి అనే జిమ్, యోగా ట్రైనర్ తో కలిసి ఇనయ సుల్తానా గోవాలో ఎంజాయ్ చేస్తూ ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
ఇనయ సుల్తానా ఇతనితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. ఓ యాంకర్ ఈ వీడియోల కింద కామెంట్ చేయగా అవును ఇప్పుడు అఫిషియల్ అని తన రిలేషన్ గురించి రిప్లై ఇచ్చింది ఇనయ సుల్తానా. అయితే మాములు ఫొటోలు, రీల్స్ కాకుండా బాత్రూం టవల్స్ తో పర్సనల్ గా దిగిన ఫొటోలు కూడా పోస్ట్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎంత ప్రేమలో ఉంటే మాత్రం మాములు ఫొటోలు షేర్ చేసి చెప్తే సరిపోదా, పర్సనల్ ఫొటోలు కూడా షేర్ చేయాలా అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ తో సినిమాల్లో బిజీ అవ్వకపోయినా లైఫ్ మాత్రం సెట్ చేసేసుకుంది ఇనయ సుల్తానా.