Akhil Sarthak : ఇల్లు వదిలేసిన బిగ్‌బాస్ రన్నర్.. ఒంటరిగా ఉండటం కష్టంగా ఉంది
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రన్నరప్ అఖిల్ సార్ధక్ గట్టి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవకాశాల కోసం మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Akhil Sarthak
Akhil Sarthak : నటుడు అఖిల్ సార్థక్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో పాల్గొనడం ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఆ సీజన్‌లో రన్నరప్‌గా నిలచిని అఖిల్‌కి సరైన బ్రేక్ దొరకలేదని చెప్పాలి. అవకాశాల కోసం ఇంటి నుండి బయటకు వచ్చిన అఖిల్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
Koratala Siva : ఏడేళ్లుగా ‘శ్రీమంతుడు’ రచ్చ.. సుప్రీంకోర్టులో కూడా కొరటాల శివకు చుక్కెదురు..
అఖిల్ ‘బావ మరదలు’ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా వెలుగులోకి వచ్చారు అఖిల్ సార్ధక్. అతను మోడల్ కూడా. అనేక పోటీల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఎవరే నువ్వు మోహిని, బంగారు గాజులు, కళ్యాణి వంటి సీరియల్స్‌లో నటించారు. అలా బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది అఖిల్‌కి. బిగ్ బాస్ 4 లో 15వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కి ఎంత గుర్తింపు వచ్చిందో అంతే ట్రోలింగ్ ఎదుర్కున్నారు.ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్‌లో సైతం అఖిల్‌కి ఛాన్స్ వచ్చింది. అక్కడ నటి బిందుమాధవితో గొడవలు పెట్టుకున్నారు. చివరకు ఆమె విన్నర్ కాగా అఖిల్ రన్నర్ అయ్యారు. మొదటి సీజన్‌లో మోనాల్‌కి.. ఓటీటీలో తేజస్వికి అఖిల్ దగ్గరయ్యారు.
Dil Raju : రవితేజ కోసం సందీప్ కిషన్ వెనక్కి తగ్గాడు.. కానీ ఆ ఇద్దరు మాత్రం..
ఇక ఇదంతా ఇలా ఉంచితే రీసెంట్‌గా అఖిల్ ఓ ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. తను అవకాశాల కోసం ఈసీఐఎల్‌లోని తన ఇంటిని వదిలిపెట్టి సినిమా ఇండస్ట్రీకి దగ్గర వచ్చేసానని చెప్పారు. డైరెక్టర్లు ఫోన్ చేసినప్పుడల్లా నేను ఈసీఐఎల్‌లో ఉన్నానని చెబుతుంటే అంత దూరంలోనా? అని ఫోన్ పెట్టేస్తున్నారని వాపోయారు. కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉండటం మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తోందని అన్నారు. ఎక్కడో విదేశాల్లో ఉంటూ చాలామంది ఒంటరిగా ఉన్నాం అంటారు.. కానీ తాను ఇంటికి గంటన్నర దూరంలో ఉండి ఒంటరివాడిలా ఉంటున్నానని అఖిల్ ఎమోషనల్ అయ్యారు. బయటకు ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తామని లోపల చాలా ఫీల్ అవుతుంటామని.. తాను సాధించిన అంశాలను రీ కలెక్ట్ చేసుకుంటూ ఏం చేయలేకపోతున్నా అనే బాధ నుండి బయటపడతానని అఖిల్ చెప్పారు. అవకాశాలు రావాలంటే రైట్ టైమ్ రావాలి.. దాని కోసమే తాను ఎదురుచూస్తూ హోప్‌తో ఉన్నానని అఖిల్ చెప్పుకొచ్చారు. కొన్ని సీరియల్స్ .. షార్ట్ ఫిల్మ్స్‌తో పేరు తెచ్చుకున్నా బిగ్ స్క్రీన్‌పై మంచి అవకాశాల కోసం అఖిల్ సార్ధక్ ఎదురుచూస్తున్నారు.