Bigg Boss 8 – Prerana : బిగ్ బాస్ సీజన్ 8.. నాలుగో కంటెస్టెంట్.. ప్రేరణ ఎవరంటే..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో కంటెస్టెంట్ గా సీరియల్ నటి ప్రేరణ ఎంట్రీ ఇచ్చింది.
Bigg Boss 8 – Prerana : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాగార్జున హోస్ట్ తో గ్రాండ్ గా ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు గ్రాండ్ ఎంట్రీ తమ స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో ఇస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ రాగా, రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్, మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్ రాగా ఇప్పుడు నాలుగో కంటెస్టెంట్ గా నటి ప్రేరణ ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో కంటెస్టెంట్ గా సీరియల్ నటి ప్రేరణ ఎంట్రీ ఇచ్చింది. కన్నడలో పలు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ప్రేరణ తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో పాటు పలు షోలతో పాపులారిటీ తెచ్చుకుంది. ఆల్రెడీ ఈ అమ్మడికి పెళ్లి అయింది. పలు కన్నడ సినిమాలో కూడా నటిస్తుంది. ఇప్పుడు ఇలా తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.