Deepika Rangaraju : మాకు సొంత ఇల్లు కూడా లేదు.. స్మశానంలో ఆరడుగుల స్థలం తప్ప..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు సొంతిల్లు కూడా లేదని చెప్తూ ఎమోషనల్ అయింది.

Deepika Rangaraju
Deepika Rangaraju : బ్రహ్మముడి సీరియల్ తో తెలుగులో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది తమిళ భామ దీపిక రంగరాజు. బ్రహ్మముడి సీరియల్ తో పాటు పలు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం రెండు చేతులా బాగానే సంపాదిస్తుంది. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు సొంతిల్లు కూడా లేదని చెప్తూ ఎమోషనల్ అయింది.
దీపిక రంగరాజు మాట్లాడుతూ.. నాకు సొంత ఇల్లు కూడా లేదు. చెన్నైలో ఒక సొంత ఇల్లు ఉండాలని నా కోరిక. నాకు శ్మశానంలో ఒక ఆరు అడుగుల స్థలం ఉంది అంతే, అది తప్ప నాకు ఇంకేం లేవు. నేనేం కోట్లు సంపాదించట్లేదు. లక్షల్లోనే సంపాదిస్తున్నా. ఈ ఫేమ్ అంతా ఇటీవలే బ్రహ్మముడి సీరియల్ నుంచే వచ్చింది. అంతకుముందు కూడా ఇండస్ట్రీలో ఉన్నా కానీ ఎవరికీ తెలీదు. చెన్నైలో ఒక్కో అపార్ట్మెంట్ కోటి రూపాయల పైనే ఉంది. ఒక్క ఇల్లు అయినా ఉండాలి అని తెలిపింది.