Bujjikondave : త‌ల్లిదండ్రుల హృద‌యాన్ని తాకుతున్న ‘బుజ్జి కొండ‌వే’.. సైంధ‌వ్ మూవీ నుంచి థ‌ర్డ్ సింగిల్ రిలీజ్‌

విక్టరీ వెంక‌టేశ్ న‌టిస్తున్న తాజా చిత్రం సైంధవ్‌.

Bujjikondave : త‌ల్లిదండ్రుల హృద‌యాన్ని తాకుతున్న ‘బుజ్జి కొండ‌వే’..  సైంధ‌వ్ మూవీ నుంచి థ‌ర్డ్ సింగిల్ రిలీజ్‌

Bujjikondave third single from Saindhav movie

Updated On : December 29, 2023 / 4:44 PM IST

Bujjikondave-Saindhav : విక్టరీ వెంక‌టేశ్ న‌టిస్తున్న తాజా చిత్రం సైంధవ్‌. వెంక‌టేశ్ కెరీర్‌లో 75వ‌ సినిమాగా తెర‌కెక్క‌తున్న ఈ చిత్రానికి హిట్ ఫేం శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా 2024 జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు త‌మిళ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్యక్ర‌మాల్లో వేగం పెంచింది.

అందులో భాగంగా వ‌రుస‌గా ఈ సినిమాలోని పాట‌ల‌ను విడుద‌ల చేస్తోంది. సంతోష్ నారాయ‌ణ్ సంగీతాన్ని అందించిన ‘రాంగ్ యూసేజ్’, ‘స‌ర‌దా స‌ర‌దా’ పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ‘బుజ్జికొండ‌వే’ అంటూ సాగే మూడో పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. తండ్రీ కూతురు మ‌ధ్య వ‌చ్చే పాట ఇది. ఈ సాంగ్ ప్ర‌తి త‌ల్లిదండ్రుల హృద‌యాల‌ను తాకుతోంది.

Thaman : ఆ డీజే సాంగ్‌ని కాపీ కొట్టిన థమన్.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ పై మీమ్స్..

జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య‌, రుహానీ శ‌ర్మ‌, ఆండ్రియా జెర్మియాలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Prashanth Varma : ఒక్క డైరెక్టర్ చేతిలోనే మొత్తం 12 సూపర్ హీరో సినిమాలు.. నెక్స్ట్ ‘అధీర’..