Karthik Palani : టీజర్ పై నెగిటివ్ టాక్ వచ్చిన మాట నిజమే.. అందుకే.. ఆదిపురుష్ పై కెమెరామెన్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా ఆదిపురుష్ సినిమా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళని తమిళ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కార్తీక్ మాట్లాడుతూ..............

camermen Karthik Palani comments on Adipurush
Karthik Palani : ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రభాస్ రాముడిగా కనపడనున్నాడు అని తెలియడంతో ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆదిపురుష్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయిన తర్వాత దారుణమైన విమర్శలు వచ్చాయి.
ఆదిపురుష్ బొమ్మల సినిమా అని, రాముడిగా చూపిస్తా అని చెప్పి కార్టూన్స్ చూపించారని, కొన్ని పాత్రలతో హిందూ మనోభావాలు దెబ్బతీశారని.. ఇలా అనేక రకాలుగా విమర్శలు, వ్యతిరేకత అన్ని వైపుల నుంచి వచ్చింది ఆదిపురుష్ సినిమాకి. చిత్రయూనిట్ ఈ వ్యతిరేకతని ఊహించకపోవడంతో షాక్ అయి జరిగిన తప్పుని తెలుసుకొని సినిమాని ఇంకో ఆరు నెలలు వాయిదా వేసి గ్రాఫిక్స్ ని సరిదిద్దే పనిలో పడ్డారు. ఆ ఒక్క టీజర్ తో సినిమాపై ఉన్న అంచనాలు మొత్తం పడిపోయాయి. ఇక ఆదిపురుష్ సినిమా ఇప్పట్లో రిలీజ్ కూడా లేదు. ప్రస్తుతం ఆదిపురుష్ గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతున్నాయి.
South Directors : క్రేజ్ పెంచుకొని తమ సినిమాలపై అంచనాలు పెంచేస్తున్న సౌత్ డైరెక్టర్లు..
తాజాగా ఆదిపురుష్ సినిమా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళని తమిళ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కార్తీక్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా టీజర్ కి నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి నిజమే. అందుకే ఈ సారి విజువల్స్ మరింత బాగా తీర్చిదిద్దాలని చిత్రయూనిట్ వర్క్ చేస్తుంది. ఈ సారి వచ్చే అవుట్ పుట్ కచ్చితంగా అందర్నీ మెప్పిస్తుందని చిత్రయూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది అని అన్నారు. దీంతో చిత్రయూనిట్ కూడా తాము చేసిన తప్పుని గుర్తించి సరిదిద్దే పనిలో ఉన్నట్టు అర్ధమవుతుంది. మరి ఈ సారి వచ్చే అవుట్ పుట్ ఎలా ఉంటుందో, సినిమాని, అందులో ప్రభాస్ ని ఎలా చూపిస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు.