ఎన్టీఆర్ నే మెప్పించారు, టీడీపీకి ప్రచారం చేశారు

టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. వేణుమాధవ్ మృతికి ప్రగాడ సంతాపం

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 09:35 AM IST
ఎన్టీఆర్ నే మెప్పించారు, టీడీపీకి ప్రచారం చేశారు

Updated On : September 25, 2019 / 9:35 AM IST

టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. వేణుమాధవ్ మృతికి ప్రగాడ సంతాపం

టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు.. వేణుమాధవ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వేణుమాధవ్ మృతి తెలుగు సినీ రంగంతో పాటు టీడీపీకి తీరని లోటు అన్నారు. వేణుమాధవ్ టీడీపీని, ఎన్టీఆర్ ని ఎంతో అభిమానించేవారని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. మహానాడులో తన మిమిక్రీ ద్వారా ఎన్టీఆర్ ని వేణుమాధవ్ ఆకట్టుకున్నారని చంద్రబాబు చెప్పారు. టీడీపీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారని తెలిపారు. మహానాడు ప్రదర్శనలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వేణుమాధవ్ అద్భుతంగా చెప్పేవారని… సభ తర్వాత వేణుమాధవ్‌ ని ఎన్టీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారని చంద్రబాబు తెలిపారు. మిమిక్రీ కళాకారుడిగా, హాస్యనటుడిగా వేణుమాధవ్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని చంద్రబాబు పొగిడారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన వేణుమాధవ్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(సెప్టెంబర్ 25,2019) మధ్యాహ్నం 12:21 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వేణుమాధవ్ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కమెడియన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.