SPB కోలుకోవాలంటూ చిలుకూరు ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది..

  • Published By: sekhar ,Published On : August 19, 2020 / 07:40 PM IST
SPB కోలుకోవాలంటూ చిలుకూరు ఆలయంలో  ప్రత్యేక పూజలు.. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది..

Updated On : August 20, 2020 / 7:09 AM IST

SPB Health Bulletin: సుప్రసిద్ధ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోవిడ్-19తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బాలు ప్రస్తుతం చెన్నై ఎం.జి.ఎం హెల్త్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాలు క్షేమంగా తిరిగి రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. సామన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఆయన క్షేమాన్ని కాంక్షిస్తున్నారు.



తాజాగా ఎం.జి.ఎం హాస్పిటల్ వారు బాలు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఆయన పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కాగా బాలు త్వరగా కోలుకోవాలంటూ చిలుకూరు బాలాజీ ఆలయంలో అర్చకులు ప్రత్యేకపూజలు జరిపారు.SPB Health Bulletinశ్రావణమాసంలో అమావాస్యరోజు స్వామివారికి ప్రత్యేక ప్రార్థన చేశామని వారు తెలిపారు. అందరికీ అత్యంత ఇష్టమైన బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలని ఆదిత్యహృదయ పారాయణంతో పాటు నరసింహ మంత్రంతో అర్చన చేసినట్లు చెప్పారు. బాలు గారు స్వామివారికి ప్రియమైన భక్తులు.. ఎన్నోసార్లు స్వామివారి సన్నిధిలో పాడారు, స్వామివారి చిత్రంలో కూడా నటించారు.. ఆయన కోలుకుని మరిన్ని పాటలు పాడాలని వారు ఆకాంక్షించారు.