‘సంగతమిళన్’ తెలుగులో ‘విజయ్ సేతుపతి’ : చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి

‘విజయ్ సేతుపతి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు..

  • Published By: sekhar ,Published On : November 5, 2019 / 06:42 AM IST
‘సంగతమిళన్’ తెలుగులో ‘విజయ్ సేతుపతి’ : చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి

Updated On : November 5, 2019 / 6:42 AM IST

‘విజయ్ సేతుపతి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు..

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటిస్తున్న తమిళ్ మూవీ ‘సంగ తమిళన్’.. రాశీ ఖన్నా హీరోయిన్.. నివేదా పేతురాజ్, అశుతోష్ రాణా ఇంపార్టెంట్ రోల్స్ చేశారు.. విజయ్ చందర్ దర్శకత్వంలో బి.భారతి రెడ్డి నిర్మించిన ఈ సినిమాను తెలుగులో రావూరి శ్రీనివాస్ రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్, రొమాన్స్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి డ్యుయెల్ రోల్ చేశాడు..

తెలుగులో ‘విజయ్ సేతుపతి’ అని హీరో పేరునే టైటిల్‌గా ఫిక్స్ చేశారు. హైదరాబాద్‌లో జరుగనున్న ‘విజయ్ సేతుపతి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. నిహారిక కొణిదెల, విజయ్ సేతుపతితో ‘ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్’ అనే తమిళ్  మూవీలో నటించింది.. విజయ్ ‘సైరా’లో రాజాపాండిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ‘ఉప్పెన’తో పాటు, అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందనున్న సినిమాలోనూ విజయ్ కీలక పాత్రలు చేస్తున్నాడు..‘సైరా’ తమిళ్ ప్రమోషన్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తను విజయ్ సేతుపతి ఫ్యాన్ అని చెప్పాడు..

Read Also : ప్రభాస్ ‘మంచి మనసు’ : చేతులెత్తి దణ్ణం పెట్టచ్చు!

ఇలా.. విజయ్ సేతుపతికి మెగా ఫ్యామిలీతో ఉన్న సినీ అనుబంధం వలన మెగాస్టార్ చిరు ‘విజయ్ సేతుపతి’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కి వస్తున్నారని తెలుస్తోంది.. తమిళనాట దీపావళికి విడుదల కావలసిన ‘సంగ తమిళన్’ థియేటర్ల కొరత కారణంగా వాయిదా పడింది. నవంబర్ 15న ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో భారీగా విడుదల కానుంది. నాజర్, శ్రీమాన్, సూరి, జాన్ విజయ్, రవి కిషన్ తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా : ఆర్.వేల్‌రాజ్, ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్, సంగీతం : వివేక్ – మెర్విన్, రచన, దర్శకత్వం : విజయ్ చందర్.