Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన భోళాశంకర్ టీమ్!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, పూర్తి ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఊరమాస్ గా ఉండటంతో ప్రేక్షకులు వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేశారు. కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.

Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన భోళాశంకర్ టీమ్!

Chiranjeevi Massive Welcome To Bholaa Shankar Sets

Updated On : January 19, 2023 / 7:59 PM IST

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, పూర్తి ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఊరమాస్ గా ఉండటంతో ప్రేక్షకులు వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేశారు. కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.

Chiranjeevi: మరో ఊరమాస్ రీమేక్‌పై కన్నేసిన మెగాస్టార్.. డైరెక్ట్ చేసేది ఆయనే..?

ఫలితంగా ఈ సినిమా వంద కోట్ల వసూళ్లను రాబట్టి చిరు కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా విజయవంతంగా నిలవడంతో, మెగాస్టార్ తన నెక్ట్స్ మూవీని వెంటనే స్టార్ట్ చేశాడు. ఇప్పటికే దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్న చిరంజీవి తాజాగా నేడు ఈ చిత్ర సెట్స్ లో జాయిన్ అయ్యాడు. కాగా, చిరంజీవికి భోళాశంకర్ టీమ్ అదిరిపోయే గ్రాండ్ వెల్కమ్ పలికింది. వాల్తేరు వీరయ్య తో సెన్సేషన్ క్రియేట్ చేసి భోళాశంకర్ షూటింగ్ లో జాయిన్ అవుతున్నందుకు మెగాస్టార్ చేతులమీదుగా ఓ కేక్ కట్ చేయించారు.

ఇక ఈ కార్యక్రమంలో భోళాశంకర్ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అందాల భామ కీర్తి సురేష్ కూడా పాల్గొంది. తనకు ఇలాంటి వెల్కమ్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ సభ్యులకు మెగాస్టార్ థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాను కూడా అద్భుతంగా తీర్చిదిద్ది మళ్లీ ఈ సినిమా సక్సెస్ వేడుక రోజున మరింతగా ఎంజాయ్ చేద్దామని చిరు చిత్ర టీమ్ ను ఎంకరేజ్ చేశారు.