Chiranjeevi : అప్పుడు ఢిల్లీలో అవమానంగా ఫీల్ అయ్యా.. ఇప్పుడు రాజమౌళి వల్ల గర్వంగా ఫీల్ అవుతున్నా..
చిరంజీవి మాట్లాడుతూ.. ''రుద్రవీణ సినిమాకి నేషనల్ అవార్డు వస్తే అది తీసుకోవడానికి ఢిల్లీ వెళ్తే అక్కడ ఓ హాల్ లో గోడల మీద అన్ని గొప్ప సినిమాలు నార్త్ వి ఉన్నాయి. సౌత్ సినిమా........

Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ(ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు భారీగా తరలి వచ్చారు.
ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. ”రుద్రవీణ సినిమాకి నేషనల్ అవార్డు వస్తే అది తీసుకోవడానికి ఢిల్లీ వెళ్తే అక్కడ ఓ హాల్ లో గోడల మీద అన్ని గొప్ప సినిమాలు నార్త్ వి ఉన్నాయి. సౌత్ సినిమాలు ఒక రెండు, మూడు పెట్టారు. మన దగ్గర ఎంతో మంది ఉన్నారు స్టార్లు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కన్నడ స్టార్లు, తమిళ స్టార్లు ఎవరి గురించి లేవు అక్కడ. ఆ టైంలో చాలా అవమానంగా అనిపించింది. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనే వాళ్ళ అభిప్రాయం. మిగిలినవి ప్రాంతీయ సినిమాలు అని అనేవారు. వాటికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు. చాలా బాధగా అనిపించింది. ఇక్కడ వచ్చి మీడియాతో నా బాధని పంచుకున్నాను. అప్పట్నుంచి ఇప్పటి వరకు చూశాను. ఇప్పుడు తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా కాదు ఇండియన్ సినిమా అని బాహుబలి తర్వాత చెప్పారు. ప్రాంతీయ సినిమా కాదు ఇండియన్ సినిమా అని చెప్పడానికి బాహుబలి 1,2, ఆర్ఆర్ఆర్ దోహద పడ్డాయి. అలాంటి స్టేజ్ కి తెలుగు సినిమాని తీసుకెళ్లిన సృష్టికర్త రాజమౌళి ఇక్కడ ఉండటం, మన తెలుగు వాడటం మన అదృష్టం. జీవితాంతం తెలుగు పరిశ్రమ రాజమౌళి గారిని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి అని నిస్సందేహంగా చెప్పగలను. మన సినిమాని నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళినందుకు రాజమౌళిని చూసి గర్వపడుతున్నాను. అలాంటి రాజమౌళిని మనం గౌరవించుకోవాలి” అని రాజమౌళిని సన్మానించారు.
ఆ తర్వాత ఆచార్య సినిమా గురించి మాట్లాడుతూ.. ”ఆచార్య సినిమా చేశాను అంటే కూడా రాజమౌళినే కారణం. రాజమౌళి సినిమా అయ్యేదాకా ఆర్టిస్టులని వదిలిపెట్టడు. శివ చరణ్ కి కథ చెప్తే అప్పుడు చరణ్ ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉంటే ఈ లోపు నాతో సినిమా తీయమన్నాను. దాంతో ఆచార్య సినిమా కథ తీసుకొచ్చారు. కానీ దాంట్లో చరణ్ ఒక క్యారెక్టర్ చేయాలి అన్నారు. రాజమౌళిని అడిగితే ఒప్పుకోలేదు. చాలా సార్లు అడిగాము అయినా ఒప్పుకోలేదు. చివరికి సురేఖ డ్రీం ప్రాజెక్ట్ నేను చరణ్ కలిసి చేయడం అంటే అప్పుడు చాలా ఆలోచించి ఓకే చెప్పారు. నేను ఇచ్చిన డేట్స్ లోనే చేయాలి అని చెప్తే ఓకే చెప్పాము. చరణ్ డేట్స్ రాజమౌళి ఇచ్చినప్పుడు ఈ సినిమా చేశాము. శివ గారి సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. శివ చెప్పినట్టు నేను యాక్ట్ చేశాను. శివ సినిమాల్లో ఉండే కూల్ ని మా మాస్ తో జత చేసి ఆడియన్స్ కి కావాల్సిన విధంగా ప్రెజెంట్ చేశాడు. రామ్ లక్ష్మణ్ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఇచ్చారు. నేను యంగ్ గా కనపడ్డాను అంటే కెమెరామెన్ తిరు గారే కారణం. మణిశర్మ నాది ఎప్పట్నుంచో బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఈ సినిమా కూడా. టెక్నీషియన్స్ అందరికి ధన్యవాదాలు. నిర్మాత నిరంజన్ రెడ్డిని చూస్తే నా సోదరుడిలా అనిపించారు. లైఫ్ లాంగ్ వారిని వదలను. ఇవాళ ఇక్కడికి వచ్చిన నా తర్వాతి సినిమాల నిర్మాతలు, డైరెక్టర్స్ అందరికి ధన్యవాదాలు.”
Ram Charan : మా అమ్మ డ్రీం ప్రాజెక్ట్.. నాన్నతో ఈ సినిమా వల్ల ఎక్కువ టైం ఉన్నా..
”రాజమౌళి వల్ల ఇప్పుడు రీజనల్ సినిమాలు లేవు. అన్ని కలిపి ఇండియన్ సినిమాలే. పుష్ప, కేజిఎఫ్, ఆర్ఆర్ఆర్ ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే. వీళ్లంతా పాన్ ఇండియా స్టార్స్. మంచి కంటెంట్ ఉంటే అది పాన్ ఇండియా సినిమాలే. అందరు పాన్ ఇండియా స్టార్లే. అందరూ పాన్ ఇండియా డైరెక్టర్లే. ఒకప్పుడు తమిళ సినిమాల్లో మణిరత్నం, శంకర్ వావ్ అనిపించారు. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లాంటివి ఏమి లేవు. ఇప్పుడు ఉన్నది అంతా ఇండియన్ సినిమానే. ఒకప్పుడు సౌత్ సినిమాలని పట్టించుకోలేదని బాధపడిన నేను ఇప్పుడు రాజమౌళి వల్ల గర్వపడుతున్నాను. ఈ క్రెడిట్ అంతా రాజమౌళి వల్లే” అని రాజమౌళిని మరోసారి ప్రశంసించారు.
Koratala Shiva : మా నాలుగేళ్ళ కష్టం ఈ సినిమా
”పూజా హెగ్డే నీ నవ్వు చాలా బాగుంటుంది. నీ నవ్వుకి మా ఆవిడ సురేఖ కూడా పెద్ద ఫ్యాన్. నాతో చేసి ఉంటే బాగుండేది. కానీ చరణ్ తో చేసావ్. నెక్స్ట్ టైం చేద్దాం కలిసి. చరణ్ ఆల్రెడీ మొత్తం చెప్పేశాడు. చరణ్ ఈ సినిమాలో ఉండాలి అని శివ ఎందుకు పట్టుబడ్డాడా అని సినిమా చూశాక మీకే అర్ధం అవుతుంది. ఈ క్యారెక్టర్ ఎవరైనా చేస్తారు. కానీ ఇందులో ఉన్న ఒక ఎమోషన్ రియల్ లైఫ్ లో తండ్రి కొడుకులైన మీరు చేస్తేనే బాగుంటుంది అని శివ నమ్మారు. చేశారు. సినిమాలో మా ఇద్దరిది ఒక ప్రత్యేకమైన అనుబంధం. చరణ్ అద్భుతమైన నటన ప్రదర్శించాడు. శివతో అనేవాడ్ని చరణ్ ఏమో నా సినిమాలో కనపడితే చాలు అంటాడు. నేనేమో చరణ్ ఉన్నాక నేను కనపడతానా అనేవాడ్ని. అందరూ ఈ సినిమాని కచ్చితంగా అభినందిస్తారు.”
Rajamouli : చిరంజీవి గారు చరణ్ కి ఎలాంటి సలహాలు ఇవ్వరు
”రాజమౌళితో సినిమా చేశాక ఆ హీరోలకి నెక్స్ట్ సినిమా ప్లాప్ అని అంతా అంటారు. అది వాస్తవం కాదు. నేను అలాంటి వాటిని నమ్మను. ఒకవేళ అలాంటివి నమ్మేవారికి చెప్తున్నాను. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా హిట్ అవుతుంది. ఇది జరుగుతుంది. రాసిపెట్టుకోండి ఏప్రిల్ 29న ఆచార్య భారీ విజయం సాధిస్తుంది” అని అన్నారు.