CM Revanth Reddy : రాజమౌళి.. మీకు ఏం కావాలో అడగండి.. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

CM Revanth Reddy : రాజమౌళి.. మీకు ఏం కావాలో అడగండి.. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..

CM Revanth Reddy Speech in Telangana Gaddar Film Awards Event

Updated On : June 15, 2025 / 10:33 AM IST

CM Revanth Reddy : నేడు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను గద్దర్ ఫిలిం అవార్డులను విన్నర్స్ కి అందచేశారు. అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపుగా 14 ఏళ్ళ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు కార్యక్రమం నిర్వహించాలని సినీ ప్రముఖులు, దిల్ రాజు ఈ ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి నేడు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గతంలో ప్రారంభించిన సంప్రదాయాన్ని మళ్ళీ కొనసాగించడానికి సహకరించిన మంత్రులు, సినీ ప్రముఖులు అందరికి ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఎప్పుడూ గౌరవించి మీకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా మిమ్మల్ని అభినందించడానికి అవార్డులు ఇస్తుంది. గతంలో నంది అవార్డులు ప్రకటించారు. 14 ఏళ్ళ ముందు వరకు ఏ సీఎం అయినా నిర్వహించారు. వివిధ కారణాల చేత ఆగిపోయిన నంది అవార్డులను తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల పేరిట మీ ముందుకు వచ్చింది.

Also Read : Vijay Deverakonda : కాంతారావు అవార్డు అందుకున్న విజయ్ దేవరకొండ.. గద్దర్ అవార్డు వేడుకల్లో విజయ్ దేవరకొండ స్పీచ్..

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తీసిన బెస్ట్ సినిమా కళాకారులను అందర్నీ అభినందించాలి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. సినీ పరిశ్రమ అంతా వచ్చినందుకు అభినందిస్తున్నాము. ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అనేవాళ్ళు, తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నై అనేవాళ్ళు కానీ ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే టాలీవుడ్ అని, తెలుగు సినీ పరిశ్రమ అంటే హైదరాబాద్ అనే స్థాయికి ఎదిగింది. బన్నీ, వెంకట్, అశ్వినీదత్ పిల్లలు.. వీళ్లంతా నేను యంగ్ ఏజ్ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. వీళ్లంతా ఇప్పుడు పరిశ్రమలో రాణించడం, అభినందించడం ఆనందంగా ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది, మీ అభివృద్ధికి సహాయం చేస్తుంది. కొన్ని నిర్ణయాలు మీ కోసమే తీసుకుంటాం. సినీ పరిశ్రమ కూడా దేశంలో ఒక గొప్ప పరిశ్రమ. ఇవాళ హాలీవుడ్ అంటే అమెరికాకు, బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాము. మన సినీ పరిశ్రమ ఎదుగుతుంటే వాళ్ళు ఇక్కడికి ఎందుకు రారు అని నేను రాజమౌళిని అడుగుతున్నా. నేడు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి. మీకు ఏం కావాలో అడగండి. సినీ ప్రముఖులు, పెద్దలు ఏం కావాలో అడగండి నేను ఇస్తా. సినీ పరిశ్రమ ఎదగాలి.

Also Read : Balakrishna : గద్దర్ అవార్డుల వేడుకల్లో బాలయ్య స్పీచ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకొని..

నేను ఇక్కడే రాజకీయాల్లో ఉంటా. ఏ హోదాలో ఉన్నా నేను మీకు అండగా ఉంటా. మీకు అవసరమైన వసతులు అందిస్తాము. 2047 కల్లా తెలంగాణ 3 ట్రిలియన్ల ఎకానమీ అందుకోవాలి అదే నా టార్గెట్. మా వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. గద్దరన్న అంటే చైతన్యం, విప్లవం, వేగుచుక్క ఆయనని స్మరించుకుంటూ అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉంది. తెలంగాణ గద్దర్ అవార్డులు నేడు తీసుకున్న అందరికి అభినందనలు. గతంలో ఏమైనా అంశాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అందరం కలిసి పనిచేద్దాం. గద్దరన్న కుటుంబాన్ని ఆదుకుంటాం.

మా ఉప ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి. హైదరాబాద్ పిల్లోడు రాహుల్ సిప్లిగంజ్ ఓల్డ్ సిటీ నుంచి ఆస్కార్ అవార్డు వరకు రాణించాడు. ఈ వేదిక మీద మా భట్టి అన్న ఏం ఇచ్చినట్టు లేడు. అతన్ని అభినందించడానికి, అతనికి కూడా ఏమైనా ఇవ్వడానికి మా ఆర్థికమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. రాహుల్ సిప్లిగంజ్ కి కూడా అవార్డు ఏం ఇస్తారో ఇవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు.

 

Also Read : Allu Arjun : రేవంత్ రెడ్డి అన్న అంటూ.. అల్లు అర్జున్ స్పీచ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డు తీసుకొని..