కమెడియన్ అలీకి మాతృవియోగం..

  • Published By: vamsi ,Published On : December 19, 2019 / 04:09 AM IST
కమెడియన్ అలీకి మాతృవియోగం..

Updated On : December 19, 2019 / 4:09 AM IST

టాలీవుడ్‌ టాప్ కమెడియన్ అలీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అలీ తల్లి జైతున్ బీబీ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. అలీ సొంతూరు రాజమండ్రిలో ఆమె చివరి శ్వాస విడిచారు. ప్రస్తుతం అలీ ఓ షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్నారు. తల్లి మరణవార్త తెలుసుకున్న అలీ హుటాహుటినా రాజమండ్రి బయలు దేరారు.

అలీ తల్లి జైతున్ బీబీ పార్ధివ దేహాన్ని హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అలీ బంధువులు. సాయంత్రం అలీ తల్లి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. అలీకి కన్నతల్లిపై ఉన్న ప్రేమ ప్రత్యేకం. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. తల్లిదండ్రుల పేరిట సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారు.

గతంలో ఓసారి అలీ తన తల్లి కాళ్లు కింద కూర్చొని పడుతుండగా ఓ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. అలీ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.