‘క్రాక్’ – రక్షకుడిగా రవితేజ

క్రాక్ - రక్షకుడిగా రవితేజ.. మే 8న గ్రాండ్ రిలీజ్..

‘క్రాక్’ – రక్షకుడిగా రవితేజ

క్రాక్ – రక్షకుడిగా రవితేజ.. మే 8న గ్రాండ్ రిలీజ్..

మాస్ మహారాజా రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్..  ‘క్రాక్’.. హీరోగా రవితేజ 66వ సినిమా ఇది.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజతో చేస్తున్న హ్యాట్రిక్ ఫిలిం. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. బుధవారం ఈ సినిమా నుండి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

KRACK

సముద్రం ఒడ్డున ఉన్న ఒక ప్రాంతం కనపడేలా ఎంతో ఎత్తు నుండి మాస్ మహారాజా రవితేజ, రక్షకుడిగా నిలబడి చూస్తూ ఉన్న ఈ పోస్టర్‌ని బట్టి సినిమాలో మాస్ అంశాలతో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉండబోతున్నాయని అర్ధం అవుతోంది. గతంలో రవితేజ, గోపీచంద్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్ శ్రీను’, ‘బలుపు’ సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో ఈ సినిమాపై మాస్ రాజా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో సైతం మంచి అంచనాలు ఉన్నాయి. సమ్మర్ కానుకగా మే 8న ‘క్రాక్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఒక ఇంటెన్స్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి సూపర్ హిట్ తమిళ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

డైలాగ్స్ : సాయిమాధవ్ బుర్రా
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్ : ఎస్. థమన్
సినిమాటోగ్రఫీ : జి.కె.విష్ణు
ఎడిటింగ్ : నవీన్ నూలి
ఆర్ట్ : ఎ.ఎస్. ప్రకాష్
ఫైట్స్ : రామ్-లక్ష్మణ్
సహనిర్మాత : అమ్మిరాజు కానుమిల్లి
నిర్మాత : బి.మధు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : గోపీచంద్ మలినేని
బ్యానర్ : సరస్వతి ఫిలిమ్స్ డివిజన్.