Custody Movie: నాగచైతన్య కస్టడీ మూవీ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే..?

నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ మూవీ సెన్సార్ పనులు ముగించుకుని రన్‌టైమ్‌ను లాక్ చేసుకుంది.

Custody Movie: నాగచైతన్య కస్టడీ మూవీ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే..?

Custody Movie Completes Censor And Locks Runtime

Updated On : May 9, 2023 / 9:31 PM IST

Custody Movie: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభుత్ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Custody Movie Pre-Release Event: నాగచైతన్య, కృతి శెట్టిల ‘కస్టడీ’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాప్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. కాగా ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయగా, ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 27 నిమిషాలుగా ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

Custody Movie: కస్టడీ నుండి బిగ్ అప్డేట్ ఇచ్చిన చైతూ.. ఫ్యాన్స్ గెట్ రెడీ!

పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుండగా, అందాల భామ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. వర్సెటైల్ యాక్టర్ అరవింద్ స్వామీ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుండగా ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.