Deepika Padukone : జవాన్ సినిమాకి దీపికా పదుకొణె ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా..?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన సినిమా జవాన్ (Jawan). తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నయనతార (Nayanathara) హీరోయిన్‌గా నటించింది.

Deepika Padukone Remuneration
Deepika Padukone Remuneration : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన సినిమా జవాన్ (Jawan). తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నయనతార (Nayanathara) హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) అతిథి పాత్రలో కనిపించింది. ఆమె నటించిన పాత్రకు మంచి స్పందన వస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి దీపికా పదుకొణె పారితోషికం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
Keedaa Cola : ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ మూడో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. కీడా కోలా వచ్చేది ఎప్పుడంటే?
అయితే.. ఎట్టకేలకు ఈ వార్తలపై దీపికా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై స్పందించింది. జవాన్ సినిమా కోసం తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పింది. కథ నచ్చడంతో సినిమాలో భాగం అయ్యానని చెప్పుకొచ్చింది. షారుఖ్ ఖాన్ తో ప్రత్యేక అనుబంధం ఉందని, తామిద్దరం మంచి స్నేహితులం అని తెలిపింది. జవాన్ సినిమా విషయంలో తన రెమ్యునరేషన్ విషయంలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంది. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించింది. ఇక రణ్‌బీర్ సింగ్ హీరోగా నటించిన ’83’, ‘సర్కస్’ సినిమాల్లో సైతం దీపికా అతిథి పాత్రల్లో నటించింది. ఆయా సినిమాల్లో కథలు నచ్చడంతోనే గెస్ట్ రోల్స్ చేసినట్లు ఆమె పేర్కొంది.
Jawan Collections : ఎనిమిది రోజుల్లోనే జవాన్ 700 కోట్లు.. 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందా?
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘ఓం శాంతి ఓం’ చిత్రంతోనే బాలీవుడ్‌లో దీపికా పదుకొణె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘పఠాన్’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రాల్లో కలిసి నటించారు. బాలీవుడ్‌లో విజయవంతమైన జోడీల్లో వీరిది ఒకటి అన్న సంగతి తెలిసిందే. తనను తెరకు పరిచయం చేసిన షారుఖ్ ఖాన్ అంటే దీపిక ఎంతో గౌరవం. అందుకనే ‘జవాన్’ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించి ఉంటుందని అంటున్నారు.