Dhanush: ‘సార్’పైనే ఆశలు పెట్టుకున్న ధనుష్
తమిళ హీరో ధనుష్ నటించే సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు. ఆయన నటించిన ‘రఘువరన్ బిటెక్’ మూవీ ఇక్కడ ఎలాంటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ధనుష్ నటించిన ఏ సినిమా కూడా తెలుగులో విజయాన్ని అందుకోలేదు. దీంతో ఆయన ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ‘సార్’ అనే సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు.

Dhanush Hopes Big On Sir Movie
Dhanush: తమిళ హీరో ధనుష్ నటించే సినిమాలను తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు. ఆయన నటించిన ‘రఘువరన్ బిటెక్’ మూవీ ఇక్కడ ఎలాంటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ధనుష్ నటించిన ఏ సినిమా కూడా తెలుగులో విజయాన్ని అందుకోలేదు. దీంతో ఆయన ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ‘సార్’ అనే సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు.
Dhanush Vaathi : ధనుష్ ‘వాతి’ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ @ చెన్నై..
ఈ సినిమా అన్ని పనులు ముగించుకుని ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకులు మంచి మార్కులు వేయడంతో ఈ సినిమా విజయంపై చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఓ మంచి సోషల్ మెసేజ్‌తో దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమా సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Dhanush Vaathi : ధనుష్ ‘వాతి’ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్యాలరీ @ చెన్నై..
అయితే ధనుష్ మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాడు. సార్ మూవీ తరువాత మరో రెండు సినిమాలను నేరుగా తెలుగులో తెరకెక్కిస్తున్నాడు ఈ హీరో. అందుకే, సార్ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని అందుకుంటే, ఆయన నెక్ట్స్ తెలుగు సినిమాలకు మంచి బాట పడినట్లుగా ఉంటుందని ధనుష్ భావిస్తున్నాడు. మరి సార్ చిత్రం ధనుష్ తెలుగు ఎంట్రీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.