Dil Raju : ‘గేమ్ ఛేంజర్’ లోటు.. చరణ్ తో ఇంకో సినిమా తీసి హిట్ కొడతా.. త్వరలోనే అనౌన్స్..

నేడు నితిన్ తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడారు.

Dil Raju : ‘గేమ్ ఛేంజర్’ లోటు.. చరణ్ తో ఇంకో సినిమా తీసి హిట్ కొడతా.. త్వరలోనే అనౌన్స్..

Dil Raju Comments on Game Changer and Announce another Movie with Ram Charan

Updated On : June 30, 2025 / 9:51 PM IST

Dil Raju : రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజవ్వగా ఆశించినంత ఫలితం సాధించలేదు. శంకర్ వల్ల సినిమా వ్యయం పెరగడమే కాక మధ్యలో శంకర్ వేరే సినిమాకు వెళ్లిపోవడంతో చాలా ఆలస్యం అయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ విషయంలో తీవ్ర నిరాశ చెందారు.

దిల్ రాజు కూడా గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అయినందుకు బాధపడ్డారు, తను కూడా కొన్ని తప్పులు తెలిసి చేశా అని పలు ఇంటర్వ్యూలలో గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడారు. నేడు నితిన్ తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడారు.

Also See : Varsha Bollamma : తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీరకట్టులో మెరిసిపోతున్న వర్ష బొల్లమ్మ..

దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మాకు చిన్న లోటు గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ తో సూపర్ హిట్ సినిమా తీయలేకపోయాం అని ఒక చిన్న గిల్ట్ ఉంది. త్వరలోనే చరణ్ తో హిట్ సినిమా తీయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తాము అది అని ప్రకటించారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చరణ్ – ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా అని పలు రూమర్స్ వచ్చాయి. అలాగే చరణ్ – ఓ కన్నడ డైరెక్టర్ అని కూడా రూమర్స్ వచ్చాయి. మరి దిల్ రాజు చరణ్ కి ఏ దర్శకుడితో సినిమా సెట్ చేస్తాడో చూడాలి.

Also See : Kevvu Kartheek : భార్యతో కలిసి జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. స్వర్ణగిరి ఆలయంలో.. ఫొటోలు..