Dil Raju : దిల్ రాజు కామెంట్స్ తో అందరి హీరోల ఫ్యాన్స్ షాక్.. అంటే ఇన్ని రోజులు డబ్బులు పెట్టి కొన్నారా?

తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలతో అందరి హీరోల అభిమానులు షాక్ అవుతున్నారు.

Dil Raju : దిల్ రాజు కామెంట్స్ తో అందరి హీరోల ఫ్యాన్స్ షాక్.. అంటే ఇన్ని రోజులు డబ్బులు పెట్టి కొన్నారా?

Dil Raju Sensational Comments on You Tube Views Fans Shocked

Updated On : June 11, 2025 / 9:56 PM IST

Dil Raju : నేడు తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలతో అందరి హీరోల అభిమానులు షాక్ అవుతున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ చేసాము. దానికి వచ్చే వ్యూస్ అన్ని రియల్ వ్యూస్. మా ఆఫీస్ లో, మా పీఆర్ టీమ్ కి అందరికి చెప్పాను ఒరిజినల్ వ్యూస్ ఉండాలి అని. మిలియన్స్ వ్యూస్ డబ్బులు పెట్టి ఇకనుంచి కొనకండి అని చెప్పాను. ఒరిజినల్ గా రీచ్ అయితేనే మన సినిమాకు ఎంత రీచ్ అవుతుందో తెలుస్తుంది. డబ్బులు పెడితే వ్యూస్ వస్తున్నాయి కానీ ప్రేక్షకుడికి రీచ్ అవ్వట్లేదు అని అన్నారు.

దీనిపై మీడియా ప్రతినిధులు గతంలో జరిగిన వాటి గురించి ప్రశ్నిస్తే దిల్ రాజు.. గతం గతః ఇప్పటినుంచి మాత్రం డబ్బులు పెట్టి కొనకూడదు అని డిసైడ్ అయ్యాము. నితిన్ కూడా ఒప్పుకున్నాడు. ఒరిజినల్ వ్యూస్ తో ఎంతమందికి నిజంగా రీచ్ అవుతుందో తెలుస్తుంది. నా నుంచే ఈ మార్పు మొదలైంది. అందరూ మారాలి అని అన్నారు. దీంతో ఇండైరెక్ట్ గా గతంలో చాలా సినిమాలకు యూట్యూబ్ లో ట్రైలర్స్, సాంగ్స్, టీజర్స్ కి వ్యూస్ డబ్బులిచ్చి కొన్నాము అనే చెప్పారు. నితిన్ ఒప్పుకున్నాడు ఇప్పుడు అంటే గతంలో స్టార్ హీరోల సినిమాలకు డబ్బులిచ్చే వ్యూస్ కొన్నారని చెప్పకనే చెప్పారు.

Also Read : Dil Raju : పవన్ కళ్యాణ్ కీలక సూచనలు ఇచ్చారు.. ఇకపై తెలంగాణలో టికెట్స్ రేట్లు పెంచము..

అంటే ఇన్ని రోజులు ఫ్యాన్స్ తమ హీరోల యూట్యూబ్ ట్రైలర్స్, సాంగ్స్, టీజర్స్ కి వచ్చిన మిలియన్స్ వ్యూస్ ని రికార్డుల్లా చెప్పేవాళ్ళు. వేరే హీరోల వ్యూస్ తో కంపేర్ చేసి సోషల్ మీడియాలో గొడవలు పడేవాళ్ళు. అవన్నీ కూడా ఫేక్ అని డబులు ఇచ్చి కొన్నవే అని దిల్ రాజు ఇండైరెక్ట్ గా చెప్పేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో డబ్బులిచ్చి ఫాలోవర్లు, వ్యూస్ కొంటారని తెలిసిందే. కానీ పెద్ద సినిమాలకు, స్టార్ హీరోల సినిమాలకు కూడా డబ్బులు ఇచ్చి కొన్నాము అని దిల్ రాజు ఇండైరెక్ట్ గా చెప్పడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. వచ్చే మిలియన్స్ వ్యూస్ సగం ఫేక్ అని తెలిసిన తర్వాత ఇప్పటికైనా ఫ్యాన్స్ ఈ యూట్యూబ్ రికార్డుల గురించి కొట్టుకోవడం మానేస్తారేమో చూడాలి.

 

Also Read : Sapthami Gowda : కన్నడ భామ తెలుగులోకి ఎంట్రీ.. ‘తమ్ముడు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సప్తమి గౌడ..