Dil Raju : తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచము.. పవన్ కల్యాణ్ సలహాపైనా దిల్ రాజు రియాక్షన్..

ఈ క్రమంలో దిల్ రాజు నేడు తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Dil Raju : తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచము.. పవన్ కల్యాణ్ సలహాపైనా దిల్ రాజు రియాక్షన్..

Dil Raju Interesting Comments on Pawan Kalyan and Movie Theaters in Thammudu Trailer Launch Event

Updated On : June 11, 2025 / 10:44 PM IST

Dil Raju : నిర్మాత దిల్ రాజు నేడు తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఇటీవల థియేటర్స్ ఇష్యూ, పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం.. పలు సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు దిల్ రాజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ క్రమంలో దిల్ రాజు నేడు తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also See : Laya Gorty : తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి హీరోయిన్.. నితిన్ కి అక్క పాత్రలో..

దిల్ రాజు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో మార్పు రావాలి. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను. తమ్ముడు సినిమాకు ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగను. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. పవన్ కళ్యాణ్ నాకు ఆదర్శం. నేను పవన్ కళ్యాణ్ సూచనలను అనుసరిస్తాను. పవన్ కళ్యాణ్ సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి.

ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదు. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ దీని గురించి చర్చించాం. పవన్ కళ్యాణ్ సూచనలపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చాను. హీరోలు రెమ్యునరేషన్ల విషయంలో పునరాలోచించుకోవాలి. తమ్ముడు చిత్రానికి హీరో నితిన్, దర్శకుడు వేణు నాకు సహకరించారు.

సక్సెస్ వచ్చినప్పుడు అందరి రెమ్యునరేషన్లు పెరుగుతాయి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు అని అన్నారు. దీంతో దిల్ రాజు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దిల్ రాజు వ్యాఖ్యలపై సినీ పరిసీమ నుంచి ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

Also See : NTR : బాలీవుడ్ లో ఎన్టీఆర్ మరో సినిమా.. షారుఖ్ – సల్మాన్ తో కలిసి.. ?