Boyapati Srinu : నాకు చెప్పకుండా నా సినిమా రీమేక్ రైట్స్ అమ్మేసారు.. ఆ సినిమాకు రెమ్యునరేషన్ ఎంతంటే..
బోయపాటి శ్రీను మాస్ కమర్షియల్ సినిమాలతో తనకంటూ సపరేట్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు.(Boyapati Srinu)
Boyapati Srinu : భద్ర సినిమాతో దర్శకుడిగా మరిన బోయపాటి శ్రీను మాస్ కమర్షియల్ సినిమాలతో తనకంటూ సపరేట్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు. బాలయ్యతో వరుసగా సినిమాలు చేసి అన్ని సూపర్ హిట్స్ కొడుతున్నారు బోయపాటి శ్రీను. ప్రస్తుతం బాలయ్యతో అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.(Boyapati Srinu)
వరుస కమర్షియల్ సినిమాలతో దూసుకుపోతున్న బోయపాటి శ్రీను మొదటి సినిమా భద్ర మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాని తెరకెక్కించారు. గతంలో బోయపాటి శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు.
Also Read : Kasthuri Shankar : అతను నా కొడుకు.. ఈసారి బిగ్ బాస్ విన్నర్ అతనే..
బోయపాటి శ్రీనుకి భద్ర సినిమాకు మొదట 40 వేలు జీతంగా ఇచ్చారట దిల్ రాజు. ఆ తర్వాత బోయపాటికి అవసరం రావడంతో లక్ష అడిగితే ఇచ్చారట. అనంతరం మూడున్నర లక్షలు పెట్టి కార్ కొనిచ్చారట. సినిమా రిలీజ్ సమయానికి ఇంకో లక్షన్నర ఇచ్చారట. అలా కార్ తో కలుపుకొని దాదాపు 6 లక్షల 40 వేలు వరకు భద్ర సినిమాకు బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ తీసుకున్నారు.
అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ విషయంలో దిల్ రాజు కి, బోయపాటి శ్రీనుకి చిన్న గొడవ లాంటిది అయిందట. భద్ర సినిమా కథ, కథనం మొత్తం బోయపాటినే రాసింది. ఆ సినిమా రీమేక్ రైట్స్ ని అమ్మితే అందులో 50 శాతం బోయపాటికి ఇవ్వాలి. కానీ దిల్ రాజు బోయపాటి శ్రీనుకి చెప్పకుండా రెండు భాషలకు రీమేక్ రైట్స్ అమ్మారట. దీంతో బోయపాటి శ్రీను వెళ్లి దిల్ రాజుని నాకు చెప్పకుండా అమ్మేశారేంటి, ఒక మాట చెప్పాల్సింది కదా అని అడిగారట.
Also Read : Ramya Krishna : ఇష్టం లేకపోయినా చేసింది.. తర్వాత సౌందర్యకు క్షమాపణలు చెప్పింది..
దాంతో దిల్ రాజు.. నువ్వు మొదటి సినిమా చేయడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చేసే సినిమాపై నీకు ఎలాంటి హక్కులు లేవు అని నేను కండిషన్ పెడితే నువ్వు సినిమా చేస్తావా అని అడగడంతో బోయపాటి శ్రీను చేస్తాను సార్ అని చెప్పాడట. దాంతో ఇంక నీ ఇష్టం ఆలోచించుకో, నువ్వు అడిగితే డబ్బులు ఇస్తానని దిల్ రాజు చెప్తే వద్దు సార్ అన్నారట బోయపాటి. ఈ విషయం బోయపాటి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రవితేజ భద్ర సినిమా కన్నడ లో, తమిళ్ లో, బెంగాల్ లో రీమేక్ అయింది.
