Dimple Hayathi : కేటీఆర్, ట్రాఫిక్ డీసీపీకి డింపుల్ హయతి ప్రశ్నలు.. హైదరాబాద్ లో అడుగు బయట పెట్టగలమా?!

టాలీవుడ్ యాక్ట్రెస్ డింపుల్ హయతి హైదరాబాద్ ట్రాఫిస్ గురించి మంత్రి కేటీఆర్ అండ్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీని ప్రశ్నిస్తూ చేసిన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Dimple Hayathi : కేటీఆర్, ట్రాఫిక్ డీసీపీకి డింపుల్ హయతి ప్రశ్నలు.. హైదరాబాద్ లో అడుగు బయట పెట్టగలమా?!

Dimple Hayathi tweets to KTR and DCP about hyderabad traffic

Updated On : July 20, 2023 / 2:08 PM IST

Dimple Hayathi : టాలీవుడ్ యాక్ట్రెస్ డింపుల్ హయతి.. హైదరాబాద్ (Hyderabad) ట్రాఫిక్ DCP రాహుల్ హెగ్డే వివాదంతో గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్న హయతి, డీసీపీ మధ్య కారు పార్కింగ్ విషయంలో వివాదం తలెతింది. ఆ గొడవ ఇరువురి పై కేసులు పెట్టుకొని కోర్ట్ వరకు చేరింది. దీంతో ఈ గొడవ మీడియాలో పెద్ద చర్చ అయ్యింది. అసలే ఛాన్స్ లు తక్కువైన సమయంలో డింపుల్ ఏకంగా పోలీసులతో గొడవ పెట్టుకోవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యిపోయింది.

Project K Comic Version : లీకైన ప్రాజెక్ట్ K కామిక్ వర్షన్.. రాక్షసుడి నుంచి ప్రజల్ని కాపాడటానికి వచ్చే దేవుడు..

ప్రస్తుతం ఈ కేసు ఇంకా కోర్టులోనే కొనసాగుతుంది. ఈ సమయంలో డింపుల్ తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) అండ్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద తాను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన ఫోటోలను షేర్ చేస్తూ.. “నేను సీరియస్ గా అడుగుతున్నాను. ఇంటికి వెళ్ళాలి గంటకు పైగా పడుతుంది ఈ ట్రాఫిక్ వల్ల. ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఏంటి పరిస్థితి? అసలు హైదరాబాద్ లో అడుగు అన్న బయట పెట్టగలమా? ఫ్యూయల్ ఏమి ఫ్రీగా రావడం లేదు డియర్ గవర్నమెంట్” అంటూ కేటీఆర్ ని ట్యాగ్ చేసింది.

Samantha : చికిత్స కోసం సినిమాలకు గ్యాప్ అని చెప్పి.. ధ్యానం చేసుకుంటూ భక్తిలో మునిగిపోయిన సమంత..

ట్వీట్ లో హైదరాబాద్ డీసీపీ అంటూ ఇన్‌డైరెక్ట్ గా DCP రాహుల్ హెగ్డేనే డింపుల్ ప్రశ్నించిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల కోర్టులో వీళ్ళ కేసు విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. 41ఏ నిబంధనల ప్రకారమే డింపుల్ హయతి పట్ల పోలీసులు వ్యవహరించాలని, అలాగే నోటీసులకు స్పందించి ఆమె ఇన్వెస్టిగేషన్​కు హాజరు కావాలని ఆదేశించింది.