హిందీ ‘దృశ్యం’ సినిమా దర్శకుడు నిషికాంత్ కామత్ మృతి..

  • Published By: sekhar ,Published On : August 17, 2020 / 09:04 PM IST
హిందీ ‘దృశ్యం’ సినిమా దర్శకుడు నిషికాంత్ కామత్ మృతి..

Updated On : August 18, 2020 / 10:08 AM IST

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు నిషికాంత్ కామత్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న  ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఈ ఉదయమే నిషికాంత్ మరణించినట్లుగా వార్తలు రావడంతో.. వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నట్లు AIG హాస్పిటల్ వారు నిషికాంత్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. చికిత్స పొందుతూ సాయంత్రం 4:30కి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.



2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు నిషికాంత్. మరాఠి సినిమాల్లోకెల్లా అతిపెద్ద విజయం సాధించిన సినిమాగా ‘డోంబివాలీ ఫాస్ట్’ నిలిచింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమేకాక 2006 లో మరాఠీలో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందింది.



2016 లో జాన్ అబ్రహం నటించిన ‘రాకీ హ్యాండ్సమ్’ లో నెగటివ్ రోల్ లో కనిపించారు నిషికాంత్. ‘భవేష్ జోషి’, ‘సూపర్ హీరో’, ‘ఫుగే’, ‘జూలీ 2’ లతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించారు. అపారమైన టాలెంట్ కలిగిన నిషికాంత్ 50 ఏళ్ల వయసులో మరణించడం బాధాకరం అంటూ పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.