Atlee : బాలీవుడ్‌లో దూసుకెళ్తున్న అట్లీ.. జవాన్ తర్వాత ఆ యువ హీరోతో సినిమా..
జవాన్ సినిమా తర్వాత ఆల్రెడీ అట్లీకి ఇంకో సినిమా బాలీవుడ్ లో ఓకే అయినట్టు తాజా సమాచారం.

Director Atlee next movie also planned in Bollywood with Varun Dhawan
Director Atlee : తమిళ్ డైరెక్టర్ అట్లీ వరుసగా ఎంట్రీ నుంచే రాజారాణి, తేరి, మెర్సెల్, బిగిల్.. సినిమాలతో తీసిన నాలుగు సూపర్ హిట్స్ కొట్టి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేస్తున్నాడు. చాలా భారీగా జవాన్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు అట్లీ. సౌత్, బాలీవుడ్ ని కలిపేసి ఇంట్రెస్రింగ్ స్టోరీతో రాబోతున్నాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా, దీపికా పదుకొనే, ప్రియమణి గెస్ట్ పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే రిలీజయిన జవాన్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని చిత్రయూనిట్ తో పాటు సినీ వర్గాలు కూడా నమ్ముతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఆల్రెడీ అట్లీకి ఇంకో సినిమా బాలీవుడ్ లో ఓకే అయినట్టు తాజా సమాచారం.
బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ ఇటీవలే జాన్వీతో కలిసి బవాల్ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో తాజాగా మాట్లాడుతూ.. నా నెక్స్ట్ సినిమా అట్లీ దర్శకత్వంలో ఉంటుంది. అతని జవాన్ రిలీజ్ అయ్యాక మా సినిమా మొదలవుతుంది. ఇంతకంటే ఎక్కువ నా నెక్స్ట్ సినిమా గురించి చెప్పను అని తెలిపాడు. దీంతో అట్లీకి నెక్స్ట్ సినిమా కూడా బాలీవుడ్ లో ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల సౌత్ లో ఒకటో రెండో సినిమాలు హిట్ కొట్టేసి సైలెంట్ గా బాలీవుడ్ కి చెక్కేస్తున్నారు పలువురు డైరెక్టర్స్. మరి ఆ లిస్ట్ లో అక్కడే సినిమాలు తీస్తూ అట్లీ కూడా ఉంటాడేమో చూడాలి.