Gopichand Malineni : నమ్మిన వాళ్ళు మోసం చేసారంటూ అన్‌స్టాపబుల్ స్టేజిపై ఏడ్చేసిన డైరెక్టర్ గోపీచంద్..

ఈ షోలో బాలయ్య డైరెక్టర్ గురించి మాట్లాడుతూ క్రాక్ సినిమాకి ముందు రెండేళ్లు బాగా స్ట్రగుల్ అయ్యావు అని విన్నాను, ప్రాపర్టీ కూడా అమ్మేశావు అని తెలిసింది, ఏమైంది అని అడిగాడు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఎమోషనల్ అయి మాట్లాడుతూ..................

Gopichand Malineni : నమ్మిన వాళ్ళు మోసం చేసారంటూ అన్‌స్టాపబుల్ స్టేజిపై ఏడ్చేసిన డైరెక్టర్ గోపీచంద్..

Director Gopichand malineni gets emotional on Unstoppable stage

Updated On : January 14, 2023 / 12:50 PM IST

Gopichand Malineni :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ప్రస్తుతం సీజన్ 2 ఆహా ఓటీటీలో సాగుతుండగా ఇటీవలే ప్రభాస్, గోపీచంద్ తో కలిసి బాహుబలి ఎపిసోడ్స్ అంటూ రెండు ఎపిసోడ్స్ ని స్ట్రీమ్ చేయగా వీటికి బాగా రెస్పాండ్ వచ్చింది. ఇక ఇప్పటికే పలు ఎపిసోడ్స్ అవ్వగా తాజాగా వీరసింహారెడ్డి చిత్రయూనిట్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.

ఈ సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే వీరసింహారెడ్డి సినిమా యూనిట్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, వరలక్ష్మి శరత్ కుమార్, హానీ రోజ్, రచయిత సాయి మాధవ్ బుర్రా, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ షోకి వచ్చి బాలయ్యతో కలిసి అలరించారు.

Varalaxmi Sarath Kumar : నాకు ఆర్టిస్ట్ గా పేరు వచ్చింది తెలుగులోనే.. మొత్తానికి ఇక్కడికే షిఫ్ట్ అవుతున్నాను..

ఈ షోలో బాలయ్య డైరెక్టర్ గురించి మాట్లాడుతూ క్రాక్ సినిమాకి ముందు రెండేళ్లు బాగా స్ట్రగుల్ అయ్యావు అని విన్నాను, ప్రాపర్టీ కూడా అమ్మేశావు అని తెలిసింది, ఏమైంది అని అడిగాడు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఎమోషనల్ అయి మాట్లాడుతూ.. నమ్మిన వాళ్ళు మోసం చేశారు. సక్సెస్ ఉంటేనే ఎవరన్నా మన వెనుక ఉంటారు. ఇక్కడ, ఈ పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే ఉంటాం. క్రాక్ కి ముందు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. మళ్ళీ ఆ స్ట్రగుల్స్ పడను. ఒకసారి అనుభవం వచ్చింది అంటూ స్టేజిపై ఏడ్చేశాడు. దీంతో బాలయ్య, గోపీచంద్ ని దగ్గరికి తీసుకొని హత్తుకొని నా గోపి, నా డైరెక్టర్, ఇతనికి నేను ఉన్నాను అని చెప్పాడు.