Gunashekar: హీరోయిన్ వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్

వరుడు సినిమా పరాజయంపై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు గుణశేఖర్(Gunashekar).

Gunashekar: హీరోయిన్ వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్

Director Gunasekhar shocking comments about allu arjun Varudu movie failure.

Updated On : January 26, 2026 / 12:03 PM IST
  • వరుడు సినిమా ప్లాప్ పై గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్
  • ఆడియన్స్ అంచనాలను హీరోయిన్ అందుకోలేదు
  • అది సినిమాపై ప్రభావం చూపించిందట

Gunashekar: టాలీవుడ్ సీనియర్ దర్శకుల్లో గుణేశేఖర్ ఒకరు. భారీ సెట్టింగులకి కేరాఫ్ గా ఉండేవాడు ఈ దర్శకుడు. ఒక్కడు, చూడాలని ఉంది లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత వరుస ప్లాప్స్ చేసి ఫేడ్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత గ్రాఫికల్ మూవీస్ గా రుద్రమదేవి, శాకుంతలం లాంటి సినిమాలు చేశాడు. వాటిలో రుద్రమదేవి పరవాలేదు అనిపించినా శాకుంతలం సినిమా మాత్రం భారీ డిజాస్టర్ అయ్యింది.

దీంతో చాలా గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు యుఫొరియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సారా అర్జున్, భూమిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు దర్శకుడు గుణశేఖర్(Gunashekar).

Irumudi First Look: రవితేజ కొత్త సినిమా ‘ఇరుముడి’.. ఫస్ట్ లుక్ విడుదల

ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మీ కెరీర్ లో బాగా డిజప్పాయింట్ చేసిన సినిమా ఏది అని అడిగారు. దానికి సమాధానంగా గుణశేఖర్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో నన్ను బాగా డిజప్పాయింట్ చేసిన వరుడు. అల్లు అర్జున్ నేను చెప్పిన ఐదు రోజుల పెళ్లి, పీటలపైనే అమ్మాయిని చూడటం అనే పాయింట్ ని చాలా బాగా నమ్మాడు. కథ కూడా చాలా బాగా సెట్ అయ్యింది. నిజానికి ఆ సినిమాలో యాక్షన్ వద్దు అనుకున్నాం. దానికి బన్నీ కూడా ఒప్పుకున్నాడు. కానీ, కొంతమంది చెప్పిన మాటలు విని యాక్షన్ యాడ్ చేయాల్సి వచ్చింది.

ఇక, సినిమా ప్లాప్ అవడానికి ప్రధాన కారణం హీరోయిన్. ఆమెను సినిమాలో పీటీలమీదనే చూపించాలని ఎక్కడా రివీల్ చేయలేదు. దాంతో ప్రేక్షకులు అంచనాలు చాలా పేచేసుకున్నారు. కానీ, అమ్మయిని చూశాక ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అది సినిమాపై చాలా ఎఫెక్ట్ చూపించింది అంటూ చెప్పుకొచ్చాడు గుణశేఖర్. అలాగే, కథ విషయంలో కూడా ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. దీంతో గుణశేఖర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.