Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్.. శ్రీలీల, నవీన్ పోలిశెట్టి ఎపిసోడ్ కి ఆ డాక్టర్ గెస్ట్ గా..
శ్రీలీల, నవీన్ పోలిశెట్టి ఎపిసోడ్ కి ఒక డాక్టర్ ని గెస్ట్ గా తీసుకొచ్చారు.

Doctor Narendra Featured in Unstoppable with NBK Sreeleela Naveen Polishetty Episode
Unstoppable with NBK : ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీజన్ 4లో 5 ఎపిసోడ్స్ అవ్వగా నేడు ఆరో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. బాలయ్య అన్‌స్టాపబుల్ ఆరో ఎపిసోడ్ కి శ్రీలీల, నవీన్ పోలిశెట్టి వచ్చి సందడి చేసారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.
అయితే అన్‌స్టాపబుల్ ప్రతి ఎపిసోడ్ లో చివర సమాజంలో సేవా కార్యక్రమాలు, కొన్ని మంచి కార్యక్రమాలు, పక్క వాళ్ళ కష్టాల కోసం నిలబడేవాళ్లు, కష్టపడి ఎదుగుతున్న వాళ్ళను స్పెషల్ గెస్ట్ గా తీసుకొస్తారని తెలిసిందే. ప్రతి ఎపిసోడ్ చివర్లో ఎవరో ఒకర్ని ఇలాంటి వాళ్ళని ఆహా టీమ్ తీసుకొచ్చి అభినందించి వారికి కొంత ధన సహాయం కూడా చేస్తారు. ఈ విషయంలో బాలయ్యను, ఆహా టీమ్ ని ఇప్పటికే అభినందిస్తున్నారు.
అయితే శ్రీలీల, నవీన్ పోలిశెట్టి ఎపిసోడ్ కి ఒక డాక్టర్ ని గెస్ట్ గా తీసుకొచ్చారు. డాక్టర్ నరేంద్ర అనే వ్యక్తి తన డాక్టర్ జాబ్ వదులుకొని మరీ భద్రాద్రి కొత్తగూడెంలోని గిరిజన గ్రామానికి వెళ్లి అక్కడ సేవ చేస్తున్నారు. అక్కడ కొన్ని గ్రామాలలో నీరు, విద్యుత్ , వైద్యం.. లాంటి కనీస సౌకర్యాలు లేని గిరిజనులకు సేవచేయాలని డాక్టర్ నరేంద్ర డిసైడ్ అయ్యారు. దీంతో నరేంద్ర ఆ గ్రామాలకు వెళ్లి అక్కడ తనకు తోచినంత సహాయం చేస్తూ అక్కడి వాళ్లకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడి పిల్లల్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి కోసం పనిచేసి పలువురి ప్రాణాలు కాపాడారు నరేంద్ర. ఆ గ్రామాల్లో ఉచిత వైద్య చికిత్స అందించడమే కాక అక్కడి గ్రామాలకు నీరు, విద్యుత్తు సౌకర్యాలను తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఎపిసోడ్ లో బాలయ్య, శ్రీలీల, నవీన్ ఇతన్ని అభినందించి ఇతనికి సహాయం కూడా చేసినట్టు తెలుస్తుంది.
బాలయ్య షోకి శ్రీలీల, నవీన్ పోలిశెట్టి వచ్చిన ఎపిసోడ్ డిసెంబర్ 6న స్ట్రీమింగ్ కానుంది.