Vijayashanthi : తెలంగాణ ఉద్యమకారుడు నిర్మించిన ‘దక్కన్ సర్కార్’ పోస్టర్ రిలీజ్.. విజయశాంతి చేతుల మీదుగా..

ఈ పోస్టర్ ని లేడి సూపర్ స్టార్, ఎమ్మెల్సీ విజయశాంతి రిలీజ్ చేశారు. (Vijayashanthi)

Vijayashanthi : తెలంగాణ ఉద్యమకారుడు నిర్మించిన ‘దక్కన్ సర్కార్’ పోస్టర్ రిలీజ్.. విజయశాంతి చేతుల మీదుగా..

Vijayashanthi

Updated On : October 9, 2025 / 7:31 PM IST

Vijayashanthi : తెలంగాణ ఉద్యమకారుడు, రచయిత కళా శ్రీనివాస్ నిర్మించిన ‘దక్కన్ సర్కార్’ సినిమా పోస్టర్ రిలీజ్ కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ పోస్టర్ ని లేడి సూపర్ స్టార్, ఎమ్మెల్సీ విజయశాంతి రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారుల జేఏసీ అధ్యక్షుడు మురళీధర్ దేశ్ పాండే, చిత్ర హీరో చాణక్య, నటి మౌనిక పాల్గొన్నారు.(Vijayashanthi)

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న రచయిత కళా శ్రీనివాస్ నిర్మిస్తున్న దక్కన్ సర్కార్ సినిమా ప్రజల్లోకి వెళ్ళాలి. సినిమా అప్డేట్స్ చూస్తే ఈ సినిమా విజయవంతం అవుతుంది అని తెలుస్తుంది. 100 మంది ఆర్టిస్టులు, 50 మంది టెక్నిషియన్ల కృషి ఈ సినిమాకు ఉంది. తెలంగాణ ప్రాంతం నుండి ఇలాంటి మరిన్ని సినిమాలు రావాలి. అందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అని తెలిపారు.

Also Read : Sai Pallavi : సీత పాత్రకు ఈమెని రిజెక్ట్ చేసి.. సాయి పల్లవిని తీసుకున్నారట.. పాపం రామాయణం మిస్ అయింది..

మురళీధర్ దేశ్ పాండే మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వానికి అద్దం పట్టే ఇలాంటి సినిమాల నిర్మాణం మరిన్ని జరగాలి. ప్రభుత్వం తెలంగాణ సినిమాలను, కళాకారులను ప్రోత్సహించాలని అన్నారు. డైరెక్టర్, నిర్మాత కళా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇది ప్రజల జీవన స్థితిగతుల కథ. కొన్ని సహజ సంఘటనలను ఆధారంగా చేసుకొని నిర్మించాను. 2 సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఒడుదొడుకులు తట్టుకొని పూర్తి చేశాను. నా అభిమాన తార విజయశాంతి గారు ప్రమోషన్ చెయ్యడం గొప్పగా అనిపించింది అని అన్నారు.

నటుడు చాణక్య మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం నేను యాస, భాష గ్రామీణ పరిస్థితులు, హావభావాలు ఇలా చాలా నేర్చుకున్నాను అని తెలిపారు.

Also Read : Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ సరికొత్త రికార్డ్.. స్టార్ హీరోలందర్నీ వెనక్కి నెట్టేసి..