Darshan Wife : దర్శన్ కేసుపై మొదటిసారి స్పందించిన భార్య.. సోషల్ మీడియాలో ఏమని పోస్ట్ చేసిందంటే..

తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి దర్శన్ అరెస్ట్ అయిన తర్వాత మొదటిసారి సోషల్ మీడియాలో స్పందించింది.

Darshan Wife : దర్శన్ కేసుపై మొదటిసారి స్పందించిన భార్య.. సోషల్ మీడియాలో ఏమని పోస్ట్ చేసిందంటే..

Drashan Wife Vijayalakshmi First Reaction after Darshan Arrest

Updated On : June 20, 2024 / 12:02 PM IST

Darshan Wife : కన్నడ స్టార్ హీరో దర్శన్ ఇటీవల ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దర్శన్ కి భార్య పిల్లలు ఉండగా మరో నటి ప్రవిత్రా గౌడతో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే పవిత్రని రేణుకాస్వామి అనే దర్శన్ అభిమాని సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడంతో అతన్ని దర్శన్ హత్య చేయించాడనే ఆరోపణలతో జైలుపాలయ్యాడు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతో పాటు మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యారు.

ఇప్పటికే దర్శన్ అరెస్ట్ పై అతని కుమారుడు స్పందించి మా ఫ్యామిలీని టార్గెట్ చేయొద్దు, ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేయొద్దు అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి దర్శన్ అరెస్ట్ అయిన తర్వాత మొదటిసారి సోషల్ మీడియాలో స్పందించింది. కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ పోస్ట్ పెట్టింది విజయలక్ష్మి.

Also Read : Raviteja – Sunny Deol : రవితేజ చేయాల్సిన సినిమా బాలీవుడ్‌కి.. ఒక్క సినిమా కోసం కలిసిన రెండు అగ్ర తెలుగు నిర్మాణ సంస్థలు..

విజయలక్ష్మి తన పోస్ట్ లో.. రేణుకాస్వామి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అతని మరణాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. గత కొద్ది రోజులుగా దర్శన్, నేను, మా అబ్బాయి, దర్శన్ కుటుంబ సభ్యులు మాటల్లో వర్ణించలేని బాధను అనుభవిస్తున్నాము. గౌరవనీయమైన న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం, మీడియా మరియు సోషల్ మీడియా, సైట్ లలో ఎలాంటి తప్పుడు వార్తలు, అనధికారిక సమాచారాన్ని ప్రచురించవద్దని నేను కోరుకుంటున్నాను. అధికారులు వెల్లడించిన సమాచారం మాత్రమే ప్రచురించాలని కోరుకుంటున్నాను. చాముండేశ్వరి అమ్మవారిపై, మన న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని పోస్ట్ చేసింది.

అయితే విజయలక్ష్మి పోస్ట్ ఒక రకంగా దర్శన్ కి సపోర్ట్ గా ఉండటంతో దర్శన్ ఫ్యాన్స్ మాత్రం మీకు మేము అండగా ఉన్నాం అంటూ కామెంట్స్ చేస్తే మరికొంతమంది మాత్రం భర్త తప్పు చేసినా సపోర్ట్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్ట్ అవ్వగా, ఒకరు ఆత్మహత్య చేసుకోగా, ఒకరు మిస్ అయ్యారు.. ఈ కేసు ఇంకెక్కడిదాకా వెళ్తుందో చూడాలి.