Ee Kaalame Lyrical : దర్శకుడు మారుతి చేతుల మీదుగా ‘నచ్చినవాడు’ నుంచి ఈ కాలమే లిరికల్
లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం నచ్చినవాడు. కావ్య రమేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా, వెంకటరత్నం లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Ee Kaalame Lyrical
Ee Kaalame Lyrical From Nachinavadu : లక్ష్మణ్ చిన్నా (Laxman Chinna) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం నచ్చినవాడు(Nachinavadu). కావ్య రమేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా, వెంకటరత్నం లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్, ప్రేరణ బట్ లు కీలక పాత్రలు పోషిస్తుండగా మిజో జోసెఫ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా దర్శకుడు మారుతి ఈ చిత్రంలోంచి “ఈ కాలమే” అంటూ సాగే పాటను విడుదల చేశారు. యువ రచయిత హర్షవర్ధన్ రెడ్డి రచించగా జావేద్ అలీ ఈ పాటను పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

Ee Kaalame Lyrical
Skanda : రామ్ ‘స్కంద’ నుంచి ‘డుమ్మారే డుమ్మా’ లిరికల్
పాటను విడుదల చేసిన అనంతం దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. మలయాళ సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన ‘ఈ కాలమే’ పాటను విన్నాను. చాలా బాగుందని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను సైతం చూశానని అద్భుతంగా ఉందన్నారు. హీరో, దర్శకుడు, నిర్మాత అయిన లక్ష్మణ్ చిన్న ఈ సినిమా ద్వారా ఘన విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

Ee Kaalame Lyrical
Bhairava Dweepam : బాలయ్య అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఆ సినిమా రీ రిలీజ్ మళ్లీ వాయిదా..
హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ.. నచ్చినవాడు చిత్రం ‘ఈ కాలమే’ అనే పాటను దర్శకుడు మారుతి విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ పాట సినిమాకు ప్రాణం లాంటిదన్నారు. ఇంతటి అద్భుతమైన పాటను స్వరపరిచిన మిజో జోసెఫ్ కి, ఈ పాటను విడుదల చేసిన దర్శకుడు మారుతీ కి ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని తెలియజేయనున్నట్లు వెల్లడించారు.