Farzi : నెంబర్ వన్ సిరీస్‌గా నిలిచిన ఫర్జి.. కారణం వారిద్దరేనా?

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor), సౌత్ స్టార్స్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), రాశిఖన్నా (Raashii Khanna) ప్రధాన పాత్రల్లో రాజ్ & డీకే డైరెక్షన్ లో వచ్చిన వెబ్ సిరీస్ 'ఫర్జి' (Farzi). ఈ సిరీస్ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఇందుకు కారణం వారిద్దరే..

Farzi : నెంబర్ వన్ సిరీస్‌గా నిలిచిన ఫర్జి.. కారణం వారిద్దరేనా?

Farzi is the most watched Indian series of all time

Updated On : March 25, 2023 / 11:20 AM IST

Farzi : ఈ మధ్య కాలంలో ఆడియన్స్ సినిమాలు కంటే వెబ్ సిరీస్ పైనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఈ కల్చర్ మూవీ లవర్స్ కి బాగా దగ్గరయింది. ఇక ప్రేక్షకులు కూడా వెబ్ సిరీస్ పై ఇంటరెస్ట్ చూపిస్తుండడంతో.. స్టార్ హీరో, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అజయ్ దేవగన్, విజయ్ సేతుపతి (Vijay Sethupathi), రాశిఖన్నా(Raashii Khanna), సమంత (Samantha), వెంకటేష్ (Venkatesh), రానా (Rana) వంటి స్టార్స్ నటించగా నాగ చైతన్య (Naga Chaitanya)కూడా ఒక సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

Top 10 Web Series : సీజన్-3తో తిరిగొస్తున్న టాప్ 10 వెబ్ సిరీస్‌లు ఇవే..

ప్రస్తుతం బాలీవుడ్ లోని దర్శకులు రాజ్ & డీకే (Raj & DK) కాంబినేషన్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ ఇండియా వైడ్ భారీ పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ (Family Man) సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఈ సీజన్ నుంచి రెండు సీజన్లు రాగా.. సెకండ్ సీజన్ లో సమంత నటించడంతో సౌత్ లో కూడా ఈ సిరీస్ కి మంచి ఆదరణ లభించింది. దీంతో రాజ్ & డీకే కాంబినేషన్ తెరకెక్కిస్తున్న సిరీస్ పై సౌత్ లోను ఇంటరెస్ట్ చూపించడం మొదలు పెట్టారు.

Citadel : సిటాడెల్ ఫస్ట్ లుక్స్ రిలీజ్.. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా.. మరి బాలీవుడ్ లో సమంత లుక్స్ ఎప్పుడు?

ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరిలో దొంగ నోట్లు ప్రింట్ చేసే కథాంశంతో ‘ఫర్జి’ (Farzi) అనే సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు రాజ్ & డీకే. ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor), సౌత్ స్టార్స్ విజయ్ సేతుపతి, రాశిఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. మొత్తం 8 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సీజన్ సూపర్ హిట్టుగా నిలిచింది. విజయ్ సేతుపతి, రాశిఖన్నా కూడా ఉండడంతో సౌత్ లో కూడా చాలా మంది ఈ సిరీస్ చూశారు. దీంతో ఇండియాలోనే ఈ సిరీస్ ఎక్కువమంది చూసిన సిరీస్ గా నెంబర్ ప్లేస్ లో నిలిచింది. ఫర్జి సిరీస్ ఇంతటి స్ట్రీమింగ్ సాధించడానికి ఆ ఇద్దరు కారణం అనవచ్చు. అయితే ఇక్కడ ఇద్దరు అంటే.. రాజ్ & డీకే, విజయ్ అండ్ రాశి.