Kaikala Satyanarayana : కైకాల మరణంపై సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..

తెలుగు సినీ పరిశ్రమలో నవరస నటనా సార్వబౌవంగా పేరుని సంపాదించుకున్న నటుడు 'కైకాల సత్యనారాయణ'.. ఈరోజు ఉదయం తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇక అయన మరణ వార్త విన్న సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే...

Kaikala Satyanarayana : కైకాల మరణంపై సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..

Film and political celebrities mourn Kaikala Satyanarayana death

Updated On : December 23, 2022 / 12:03 PM IST

Kaikala Satyanarayana : తెలుగు సినీ పరిశ్రమలో నవరస నటనా సార్వబౌవంగా పేరుని సంపాదించుకున్న నటుడు ‘కైకాల సత్యనారాయణ’.. ఈరోజు ఉదయం తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. అయన మరణవార్తతో టాలీవుడ్ విషాద ఛాయలు అలుముకున్నాయి. 60 ఏళ్ళ సినీ జీవితంలో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించిన కైకాల.. తెలుగుతెరపై చెరిగిపోలేని ముద్ర వేసుకున్నారు.

Chiranjeevi : సురేఖతో ఉప్పుచేప వండి పంపించమన్నారు.. కైకాల మరణంపై ఎమోషనల్ అయిన చిరంజీవి..

ఇక అయన మరణ వార్త విన్న సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళ్లు అర్పించారు.