Film Chamber : సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్‌.. స్పందించిన ఫిలిం ఛాంబర్.. కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఈ అంశం పై తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ స్పందించింది.

Film Chamber : సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్‌.. స్పందించిన ఫిలిం ఛాంబర్.. కీల‌క ప్ర‌క‌ట‌న‌

Film Chamber announcement on CM Revanth Reddy Comments

ఇటీవ‌ల యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిపార్ట్మెంట్స్ కు నూతన వాహనాల శ్రేణిని ప్రారంభించిన సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. డ్రగ్స్ వినియోగం, సైబర్ క్రైమ్‌పై మూవీల్లో అవగాహన కల్పించాలన్నారు. అలా కల్పించని వారి సినిమాలకు టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదన్నారు. వందల కోట్ల బడ్జెట్ మూవీ అయినప్పటికీ సైబర్ క్రైమ్, డ్రగ్స్ కు దూరంగా ఉండాలంటూ సినిమాకు ముందు ప్రదర్శించాలని సూచించారు.

సినిమా టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు నిర్మాతలు వస్తుంటారని, కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని తెలిపారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై సినిమాకు ముందు కానీ సినిమా తరువాత 3 నిమిషాలు వీడియోతో అవగాహన కల్పించాలని చెప్పారు. అలా చేయని నిర్మాతలకు , డైరెక్టర్లకు, తారాగణానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవన్నారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా సహకరించాలని, డ్రగ్స్, సైబర్ నేరాలపై థియేటర్లలో ప్రసారం చేయకపోతే వారి థియేటర్లుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Janaka Aithe Ganaka Teaser : ‘జనక అయితే గనక’ టీజ‌ర్.. పిల్ల‌లు అంటే భ‌య‌ప‌డుతున్న సుహాస్‌..

ఫిలిం ఛాంబర్ స్పంద‌న ఇదే..

ఈ అంశం పై తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ స్పందించింది. ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులు కలిసినప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన విష‌యాల‌పై సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పింది.

సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ వంటి విషయాలలో చలన చిత్ర పరిశ్రమ ముందుండి ప్రభుత్వానికి అండగా ఉందనే విష‌యాన్ని తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ విషయం పై చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్స్ యాజమాన్యాలు.. డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టడానికి తమవంతు భాధ్యత నిర్వర్తించడానికి ఇకపైన కూడా ఎల్లవేళలా తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటుంది. దీనిపై అతి త్వరలో సీఎం క‌ల‌వ‌నున్న‌ట్లు తెలిపింది.

Vishwambhara Update : మెగాస్టార్ ‘విశ్వంభర’ అప్డేట్.. డబ్బింగ్ మొదలు.. షూటింగ్ అయిపోయిందా?