Bunny Vas : నిర్మాత బన్నీ వాసుకు తప్పిన ప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో నిర్మాత బన్నీ వాసుకు  తృటిలో ప్రమాదం  తప్పింది.

Bunny Vas : నిర్మాత బన్నీ వాసుకు తప్పిన ప్రమాదం

Bunny Vas

Updated On : July 16, 2022 / 7:56 PM IST

Bunny Vas :  పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో నిర్మాత బన్నీ వాసుకు  తృటిలో ప్రమాదం  తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది పొంగి పొర్లుతోంది. పలు గ్రామాలు నీట మునిగాయి. వరద నీరు గ్రామాలను చుట్టు ముట్టటంతో ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది.

బాడవ గ్రామంలో  వరదలో చిక్కుకున్న వారిని పడవలో  ఏనుగువారి లంక తీసుకు వస్తుండగా వరద ఉధృతి పెరిగింది. దీంతో పడవ నీటిలో కొట్టుకోపోసాగింది.  ఆ క్రమంలో పడవ కొబ్బరి చెట్టుకు  తగిలి ఆగింది.  దీంతో  పడవలోని వారంతా కంగారు పడటంతో పడవ విరిగి పోయింది.  వెంటనే పడవ నడిపే వ్యక్తులు పడవలోని వారిని రక్షించారు.

ఈ పడవలో సినీ నిర్మాత బన్నీవాసు, జనసేన నాయకులు, గర్భిణీ ఉంది. ప్రమాదం తప్పటంతో పడవలోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.  అదృష్టం బాగుండి ప్రమాదం తప్పిందని బన్నీ వాసు అన్నారు. ప్రమాదం అంచున లంక గ్రామాల ప్రజలు ఉన్నారని…. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Also Read :Delhi : తండ్రిని కొట్టిన వ్యక్తిపై బాలుడి ప్రతీకారం-తుపాకీతో కాల్పులు