Varun Tej : మెగా ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్..
గాండీవధారి అర్జున ప్రమోషన్స్ లో ఉన్న వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్ గురించి మాట్లాడాడు.

Gandeevadhari Arjuna Varun Tej comments on multistarrer from mega family
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీ ఈ నెల 25న రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ అండ్ మూవీ టీం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే వరుణ్, సాక్షి, ప్రవీణ్ కలిసి 10tv ఛానల్ కి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో గాండీవధారి అర్జునతో పాటు ఇతర ప్రాజెక్ట్స్ విషయాలు కూడా తెలియజేశాడు.
Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ ఫిక్స్ చేసేది ఎవరో తెలుసా..?
కాగా ఇటీవల పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ కలిసి బ్రో వంటి మల్టీస్టారర్ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా ఇంకేమన్నా మెగా మల్టీస్టారర్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందా? అని వరుణ్ ని ప్రశ్నించగా.. “మంచి కథలు వస్తే తప్పకుండా చేస్తాము. చిరంజీవి గారు చరణ్ కలిసి కనపడ్డారు. ఆ తరువాత పవన్ బాబాయ్, తేజ్. అలా మల్టీస్టారర్ చేయాలనీ మాకు ఉంది. రచయితలకు, దర్శకులకు కథలు రాసుకు రమ్మని చెప్పండి” అంటూ పేర్కొన్నాడు.
Varun Tej : ఈసారి ఎన్నికల్లో పవన్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయనుందా..? వరుణ్ తేజ్ ఏం చెప్పాడు..?
ఇక ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమా రిలీజ్ కి రెడీ ఉంది. దీని తరువాత రాబోతున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) షూటింగ్ కూడా దాదాపు మొత్తం పూర్తి అయ్యిందని వెల్లడించాడు. ఈ చిత్రం తరువాత చేయవల్సిన ‘మట్కా’ (Matka) షూటింగ్ మొదలుపెట్టే విషయంలోనే కొంచెం సందేహం నెలకుందని చెప్పుకొచ్చాడు. ఇటీవల వరుణ్, లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి డేట్ ఫిక్స్ అయిన దాన్నిబట్టి మట్కా షూటింగ్ డిసైడ్ అవుతుందని వరుణ్ వెల్లడించాడు.