బిగ్‌బాస్‌పై వితిక, గీతా మాధురి షాకింగ్ కామెంట్స్..

  • Published By: sekhar ,Published On : October 8, 2020 / 12:15 PM IST
బిగ్‌బాస్‌పై వితిక, గీతా మాధురి షాకింగ్ కామెంట్స్..

Updated On : October 8, 2020 / 12:27 PM IST

Bigg Boss – Geetha Madhuri: పాపులర్ టాలీవుడ్ సింగర్ గీతా మాధురి రియాలిటీ షో పై చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. నాని హోస్ట్ చేసిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 లో గీత పార్టిసిపేట్ చేసింది. ఆ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా బరిలోకి దిగిన గీత రన్నరప్‌గా నిలిచింది.


హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తీసుకున్న ఫొటోను ఆమె తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ పిక్‌లో గీత చాలా సన్నగా ఉంది. ‘రెండు సంవత్సరాల క్రితం ఫొటో. బరువు తగ్గించుకుని సన్నగా అవ్వాలనుకుంటే బిగ్‌బాస్‌కు వెళ్లమని మీకు సలహా ఇస్తాను’ అని కామెంట్ చేసింది.


మూడో సీజన్‌లో పాల్గొన్న వితికా షెరు ఇటీవల తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. బిగ్‌బాస్ వల్ల తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యానని చెప్పింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ఫిమేల్ కంటెస్టెంట్లు కూడా తమ అనుభవాలను వెల్లడించాలని కోరింది.Geetha Madhuri