OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!

ధియేటర్లలోనే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల జాతర నడుస్తుంది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, ఆచార్య హవా నడుస్తుండగా.. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి

OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!

Ott Release

Updated On : May 2, 2022 / 6:57 PM IST

OTT Release: ధియేటర్లలోనే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల జాతర నడుస్తుంది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, ఆచార్య హవా నడుస్తుండగా.. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఓటీటీలో ఈ వారం కూడా గ్రాండ్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఓటీటీలలో విడుదల అవుతున్న సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండడంతో అందుకు తగ్గట్టుగానే సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో దూసుకొస్తున్నాయి.

OTT Release: థియేటర్ రిలీజ్ ఒక్కటే సినిమా.. టైమ్ చూసి దాడికి సిద్దమైన ఓటీటీలు!

మరి ఈ వారం ఏ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలోకి రాబోతోందో డీటెయిల్డ్ గా చూద్దాం. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌(కన్నడ)- మే5వ తేదీ నుంచి, ద వైల్డ్‌(వెబ్‌సిరీస్‌2)- మే6వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రేమ్‌ లో స్ట్రీమింగ్‌ కానున్నాయి. హోమ్‌ శాంతి(హిందీ సిరీస్‌)-మే6వ తేదీ నుంచి, స్టోరీస్‌ ఆన్‌ది నెక్ట్స్‌ పేజ్‌(హిందీ సిరీస్‌)-మే6వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ కానున్నాయి. ఝండ్‌(హిందీ)-మే6వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది.

OTT Releases: అదిరే ఆఫర్స్.. ఓటీటీ బాటలో మినిమం బడ్జెట్ మూవీస్!

తెలుగుతో పాటు సౌత్ బాషలలో ఎప్పుడో ఓటీటీ రిలీజ్ అయిన రాధేశ్యామ్‌ హిందీలో ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కానుంది. రాధేశ్యామ్ హిందీ-మే4వ తేదీ నుంచి, థార్‌(హిందీ)-మే6వ తేదీ నుంచి, 40 ఇయర్స్‌ యంగ్‌(హాలీవుడ్‌)-మే4వ తేదీ నుంచి, ది సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌(వెబ్‌సిరీస్‌)-మే6వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానున్నాయి.