‘చిత్రలహరి’ నుంచి గ్లాస్ మేట్స్ సాంగ్ రిలీజ్

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చిత్రలహరి’. ‘నేను శైలజ’ ఫేమ్ తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రలహరిలో రెండో ఆడియో సాంగ్ రిలీజ్ అయింది. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే ఇటీవల విడుదలైన ‘పరుగు పరుగు’ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాలోనే రెండో పాట క్లాస్ మేట్స్, సోల్ మేట్స్, రూమ్ మేట్స్ ఇలా అందరికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఉంటుంది కాని.. ఏ ఎండు లేని వాడే మందు పంచుకునే గ్లాస్ మేట్స్..గలగలగల గలగలగల గ్లాస్‌మేట్సు..అంటూ సాగే ఈ పాట మందు బాబులను ఎంతో ఆకట్టుకునేలా ఉంది. రాహుల్ సిప్లిగంజ్, పెంచల్ దాస్, దేవీశ్రీ ఆలపించిన ఈ పాట చాలా బాగుంది. యూత్‌కు ఇట్టే కనెక్ట్ అయిపోతుంది. అంతేకాదు ఈ పాటలో సునీల్ తో కలిసి సాయి ధరం చేసిన అల్లరి ఓ రేంజ్ లో ఉంటుందట..ఈ పాటను ఆదివారం రాత్రి 7 గంటలకు విడుదల చేశారు.
ఈ పాట మధ్యలో చాలా మందికి తెలియని ఓ వాయిద్యాన్ని ఓ అమ్మాయి వాయిస్తున్నారు. ఆ వాయిద్యాన్ని సారంగి అంటారు. దాన్ని వాయిస్తోన్న అమ్మాయి పేరు మనోన్మణి. దక్షిణాది భారతదేశం నుంచి ఈ వాయిద్యాన్ని వాయించిన తొలి మహిళ మనోన్మణి. రంగస్థలం తర్వాత మెగా హీరోతో మైత్రి సంస్థ నిర్మించిన మూవీ కావడంతో ఈ సినిమాకు అంచనాలు భాగానే ఉన్నాయి.