Sankranthiki Vasthunam : విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఫస్టు సాంగ్.. ‘గోదారి గట్టు మీద రామసిలకవే’.. వెంకీ, ఐశ్వర్య డ్యాన్స్ అదుర్స్..
'గోదారి గట్టు మీద రామసిలకవే.. ఓ గోరింటాకెట్టుకున్న సందమామవే.' అంటూ ఈ పాట సాగుతోంది.

Godari Gattu Lyrical song from Sankranthiki Vasthunam out now
సీనియర్ హీరో వెంకటేశ్ నటిస్తున్న మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘గోదారి గట్టు మీద రామసిలకవే.. ఓ గోరింటాకెట్టుకున్న సందమామవే.’ అంటూ ఈ పాట సాగుతోంది.
Movie Shootings : మెగాస్టార్ నుంచి నాని వరకు.. ఏ హీరో సినిమా షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
భాస్కరభట్ల లిరిక్స్ అందించగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు. సీనియర్ సంగీత దర్శకుడు రమణ గోగుల, తెలంగాణ ఫోక్ సింగర్ మధుప్రియ లు కలిసి ఈ పాటను పాడారు. చాలా కాలం తరువాత రమణ గోగుల పాడడం విశేషం. ఈ పాటలో వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ ల డ్యాన్స్ ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
Nargis Fakhri sister : ప్రముఖ నటి సోదరి అరెస్ట్.. ప్రియుడు ఉన్న ఇంటికి నిప్పు అంటించి..