ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం-కోట్లలో నష్టం

బాంబే, గుర్గావ్ ప్రాంతంలోని, ఇండస్ట్రీయల్ పార్క్ ఏరియాలో ఉన్న ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్‌లోని మొదటి అంతస్థులో మంటలు చెలరేగి, ఉవ్వెత్తున ఎగసి పడుతూ బిల్డింగ్ అంతా వ్యాపించాయి..

  • Published By: sekhar ,Published On : May 1, 2019 / 07:20 AM IST
ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం-కోట్లలో నష్టం

Updated On : May 28, 2020 / 3:40 PM IST

బాంబే, గుర్గావ్ ప్రాంతంలోని, ఇండస్ట్రీయల్ పార్క్ ఏరియాలో ఉన్న ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్‌లోని మొదటి అంతస్థులో మంటలు చెలరేగి, ఉవ్వెత్తున ఎగసి పడుతూ బిల్డింగ్ అంతా వ్యాపించాయి..

ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్‌కి సంబంధించిన ధర్మ ప్రొడక్షన్స్ స్టూడియోలో అగ్నిప్రమాదం జరగింది. ఈ సంఘటనలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడమే కాక, విలువైన జ్ఞాపకాలు కూడా కాలిబూడిదయ్యాయి. ఈ సంఘటన గురించి నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన బాంబే, గుర్గావ్ ప్రాంతంలోని, ఇండస్ట్రీయల్ పార్క్ ఏరియాలో ఉన్న ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్‌లోని మొదటి అంతస్థులో మంటలు చెలరేగి, ఉవ్వెత్తున ఎగసి పడుతూ బిల్డింగ్ అంతా వ్యాపించాయి.
Also Read : తెలివైన భార్య డేంజర్: ఆనంద్ మహేంద్ర ట్వీట్: షాక్ ఇచ్చిన భార్య

దీంతో షూటింగ్‌కి సంబంధించిన కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీస్, ఫర్నీచర్, పలు స్క్రిప్ట్స్‌తో పాటు, కరణ్ జోహర్ తండ్రి యశ్ జోహర్‌కి చెందిన మధురమైన జ్ఞాపకాలు కూడా కాలిపోయాయి. ఊహించని ఈ సంఘటనతో కరణ్ జోహర్ షాక్‌కి గురయ్యాడట. దాదాపు 18వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, యశ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్‌ని నిర్మించారు. ఈ ఘటన జరగడానికి ముందు ఆర్కే స్టూడియోలోనూ అగ్రిప్రమాదం సంభవించింది. ఒకేరోజు రెండు స్టూడియోస్‌లో ప్రమాదాలు జరగడంతో బాలీవుడ్ వర్గాలు షాక్ అయ్యాయి.
Also Read : వైరల్ అవుతున్న మీరా జాస్మిన్ ఫోటోలు