క్రేజీ కాంబినేషన్స్!

Gopichand – Raviteja: మాస్ మహారాజా రవితేజ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి కలయికలో ఓ సినిమా తెరకెక్కనుంది. రవితేజ ఇమేజ్, ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని మంచి కామెడీ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ రెడీ చేశారట మారుతి. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
ప్రస్తుతం రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘క్రాక్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇటీవల రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అనే మరో సినిమా కూడా కమిట్ అయ్యాడు రవితేజ.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో మలయాళంలో అద్భుత విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను ప్రముఖ నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు సాగర్ కె.చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
బిజు మీనన్ చేసిన పోలీస్ క్యారెక్టర్ పవన్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ పాత్రలో రానా, కిచ్చా సుదీప్, రవితేజ వంటి స్టార్ల పేర్లు వినిపించాయి కానీ, మూవీ టీం అధికారికంగా ప్రకటించలేదు.
కట్ చేస్తే ఇప్పుడు ఆ క్యారెక్టర్‌కు మ్యాచో స్టార్ గోపిచంద్‌ను తీసుకోబోతున్నారట. ఇటీవలే మేకర్స్ గోపిచంద్‌ను అప్రోచ్ అవగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
‘జయం, వర్షం, నిజం’ సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకున్న గోపిచంద్ ఈ మూవీలో నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్‌కి కరెక్ట్‌గా సూట్ అవుతారని మూవీ టీం భావిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.