Mana Shankara Vara Prasad Garu : మన శంకర వరప్రసాద్ గారు సీక్వెల్ !
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu ) సూపర్ రెస్పాన్స్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Gossip Garage Mana Shankara Vara Prasad Garu Sequel
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు సూపర్ రెస్పాన్స్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎమోషన్, వినోదం, సోషల్ మెసేజ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిరు గ్రేస్ అయితే జెన్‌జీని కూడా ఫిదా చేసేస్తోంది. మెగాస్టార్ కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు బాక్సాఫీస్ ఎక్స్‌పీరియన్స్ చేస్తోంది. చిరంజీవిలో వింటేజ్ ఎనర్జీ కనిపిస్తోందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక విక్టరీ వెంకటేషన్ క్యామియో అయితే ఇంకో లెవల్. ఇక హుక్ స్టెప్ అయితే కుర్రాళ్లలో ఓ క్రేజ్ క్రియేట్ చేసింది. ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ కొట్టిన మన శంకరప్రసాద్ గారు మూవీకి సంబంధించి ఇప్పుడో గాసిప్ తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీకి సీక్వెల్ ఉండబోతుందని ఫిల్మ్‌నగర్ కోడై కూస్తోంది.
ఈసారి విక్టరీ వెంకటేష్‌ను ఫుల్ లెంగ్త్ హీరోగా తీసుకుని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ భారీ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ క్యామియో రోల్‌లో వస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మన శంకర వరప్రసాద్ గారులో వెంకటేష్ ఎక్స్‌టెండెడ్ క్యామియో ఇచ్చి సినిమాకు బూస్ట్ ఇచ్చినట్టే.. ఇప్పుడు రిటర్న్‌గా మెగాస్టార్ స్పెషల్ గెస్ట్‌గా చేస్తారని టాక్.
స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయిందని టీమ్‌తో కలిసి అనిల్ రావిపూడి ఫుల్ స్వింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజం అయితే వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోకు ఇది ఐదో సినిమా అవుతుంది.
