Mega Family : మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే స్క్రీన్ మీద?
మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే స్క్రీన్ మీద కన్పించబోతున్నారా?

Gossip Garage Mega Family in one movie VM
మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే స్క్రీన్ మీద కన్పించబోతున్నారా? ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ మల్టీ హీరో మూవీగా రికార్డులు సృష్టించబోతుందా? మెగా ఫ్యామిలీ సినిమాకు దర్శకత్వం వహించేది తమిళ టాప్ డైరెక్టరేనా? అంటే అవుననే సమాధానం సినీ వర్గాల నుంచి వస్తోంది.
మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఓ భారీ మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, మెగా నాగబాబు, నిహారిక.. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రేంలో కనిపించబోతున్నారట. ఈ వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో ఓ పండగలా మారిపోయిందన్న టాక్ సినీవర్గాల్లో వినిపిస్తోంది.
అయితే మెగా ఫ్యామిలీ గ్రాండ్ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించబోయేది మరెవరో కాదని.. తమిళ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అన్నది టాక్. విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ మాస్టర్ మైండ్ ఇప్పుడు మెగా కాంపౌండ్‌కి ఓ పవర్‌ఫుల్ యాక్షన్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ భారీ మెగా ప్రాజెక్ట్‌కి ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలు బడ్జెట్ పరంగా అడ్వాన్స్ కూడా ఇచ్చేశాయట. అయితే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ భారీ మల్టీ హీరో మూవీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.
అయితే మెగా ఫ్యామిలీ మూవీకి ఇంకా టైటిల్, స్క్రిప్ట్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అంతా సీక్రెట్‌గానే ఉంచారట. కానీ ఈ ఏడాది చివర్లో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు కొందరు. మరి నిజంగానే ఈ మెగా ఫ్యామిలీ మూవీ షూటింగ్ పట్టాలెక్కితే మాత్రం మెగా ఫ్యాన్స్ కి బిగ్ ఫెస్టివలే అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ గాసిప్ న్యూస్ విన్న మెగా ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారట.