ఒకే సినిమాలో బాలకృష్ణ, పవన్ కల్యాణ్?

అటు బాలయ్య, ఇటు పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్తున్నారు.

ఒకే సినిమాలో బాలకృష్ణ, పవన్ కల్యాణ్?

Updated On : November 10, 2024 / 1:23 AM IST

Gossip Garage : ఆ ఇద్దరు మీసం మెలేయబోతున్నారు. ఒకే మూవీలో తొడగొట్టబోతున్నారు. తెలుగు సినిమాలోనే రేర్‌ కాంబినేషన్ వెండితెర మీద కనిపించబోతుంది. పాలిటికల్స్‌లో ఓ వెలుగు వెలుగుతోన్న నేతలు..స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారట. ఓ ఎమ్మెల్యే చేస్తున్న మూవీలో డిప్యూటీ సీఎం స్పెషల్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లు టాక్. ఆ ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సీన్‌ వేరే లెవల్ అంటున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు పెద్ద హీరోలు.? వాళ్లు నటించే మూవీ ఏంటి.?

అఖండ-2లో పవన్ స్పెషల్ రోల్?
నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్‌ ఒకే మూవీలో కనిపించబోతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గతేడాది సంక్రాంతి బరిలో వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న బాలయ్య వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నాడట. సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్‌గా అఖండ-2ను ఈ మధ్యే గ్రాండ్‌ లాంచ్ చేశారు బాలయ్య. అందులో డిప్యూటీ సీఎం, పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్ స్పెషల్ రోల్‌ చేయనున్నట్లు టాక్.

బాలయ్యతో కలిసి పవన్ నటన?
అఖండ-2లో బాలయ్య పాత్రకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో బాలయ్య దేవాలయాల పవిత్రతను కాపాడే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు హిందూ గ్రంధాల జోలికి వచ్చి.. వాటిని అవహేళన చేసేవారి పని పడతాడట. అఖండ సినిమాలో బాలయ్య బాబు అఘోర లుక్‌లో ఆడియన్స్‌ను అలరించారు. అఖండ- 2లో కూడా పవర్ ఫుల్ రోల్‌లో అలరిస్తారని తెలుస్తుంది. ఇందులో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా బాలయ్యతో కలసి నటించబోతున్నాడని అంటున్నారు.

ఇంటర్వెల్ టైమ్‌లో ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు హీరోలు..?
పవన్ కల్యాణ్‌.. బాలయ్య ఇద్దరు ఇంటర్వెల్ టైమ్‌లో ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారని ఆ సీన్‌ వేరే లెవల్‌లో ఉంటుందని చెబుతున్నారు. బాలయ్య, పవన్‌ ఒకే సీన్‌లో కనిపించే టైమ్‌లో వచ్చే bgmకు థియేటర్స్‌ దద్దరిల్లిపోవడం ఖాయమంటున్నారు. అటు బాలయ్య, ఇటు పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్తున్నారు. అఖండ-2కు థమన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో బాలయ్య, పవన్ కల్యాణ్‌ నటించే సీన్‌లో వచ్చే BGMపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్.

 

Also Read : అన్నా ఒక్క పోస్ట్ ప్లీజ్.! మంత్రి పదవులు, నామినేటెడ్‌ పోస్టుల కోసం నేతల ఎదురుచూపులు..