Guntur Kaaram vs HanuMan : భారీ వసూళ్ల దిశగా ‘గుంటూరు కారం’.. మరి ‘హనుమాన్’ పరిస్థితి?
సంక్రాంతి కానుకగా రిలీజైన గుంటూరు కారం, హనుమాన్ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. రికార్డుల విషయానికి వచ్చేసరికి గుంటూరు కారం దుమ్ము రేపుతోంది. పాన్ ఇండియాగా రిలీజైన హనుమాన్ కూడా బాగానే వసూళ్లు రాబడుతోంది.

Guntur Kaaram vs HanuMan
Guntur Kaaram vs HanuMan : భారీ అంచనాల మధ్య రిలీజైన ‘గుంటూరు కారం’ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియాగా విడుదలైన ‘హనుమాన్’కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే గుంటూరు కారం ఎక్సలెంట్ స్టార్ట్‌ను సొంతం చేసుకుంది. హనుమాన్ పరిస్థితి కూడా బాగానే ఉంది.
వెంకటేష్ ‘సైంధవ్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం ఫ్యామిలీ ఆడియన్స్‌కి తెగ నచ్చేస్తోంది. ఏపీ, తెలంగాణ థియేటర్లలో ఈ సినిమా గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చింది. రెండేళ్ల తర్వాత స్క్రీన్ పై మహేష్ ని చూసిన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. గుంటూరుకారం విడుదలైన మొదటి రోజున రూ.50 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ నుండి సుమారు రూ.44.50 కోట్లు, కర్నాటక రూ.4.5 కోట్లు, తమిళనాడు రూ. 0.5 కోట్లు ఇండియాలోని మరికొన్ని ప్రాంతాల నుండి మరో రూ. 0.5 కోట్లు వసూలు రాబట్టింది.
గుంటూరు కారంకి ఒకరోజు ముందు అంటే శుక్రవారం రిలీజైన తేజ సజ్జ-ప్రశాంత్ వర్మల సైన్స్ ఫిక్షన్ ఫాంటరీ సినిమా ‘హనుమాన్’ పాన్ ఇండియాగా రిలీజైంది. ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టకపోయినా సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. హనుమాన్ అన్నిభాషల్లో మొదటిరోజు రూ.7.56 కోట్లు వసూలు చేసింది. తెలుగులో రూ.5.50 కోట్లు వసూళ్లు కాగా హిందీలో రూ.2 కోట్లు.. మిగిలిన భాషల నుండి రూ.0.06 కోట్లు వసూలైంది. బాలీవుడ్‌లో ప్రస్తుతం పోటీపడే సినిమాలు లేకపోవడం హనుమాన్‌కు కలిసొచ్చేలాగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ హనుమాన్ సినిమాను ఆదరిస్తుండటంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే వీకెండ్ వచ్చేసరికి ఈ రెండు సినిమాలకు పోటీగా దగ్గుబాటి వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామి రంగా కూడా బాక్సాఫీస్ రింగ్‌లో దిగుతున్నాయి. దీంతో వీటి కలెక్షన్స్‌లలో భారీ మార్పులు జరగొచ్చు. కాగా సంక్రాంతికి విడుదలవుతున్న టాలీవుడ్ మూవీలలో గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద బలమైన పట్టు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారాంతానికి వీటి పూర్తి బలాబలాలు తేలిపోనున్నాయి.