Sreeleela : బాబోయ్ శ్రీలీలకు కూడా బ్యానర్స్ కట్టేశారుగా.. ‘మూవీకి శ్రీలీల స్వీటు.. నువ్వే నా హార్ట్ అంటూ..’

సాధారణంగా సినిమా రిలీజ్ అంటే థియేటర్స్ దగ్గర హంగామా, బ్యానర్లు, కటౌట్స్ ఉంటాయి. ఇక స్టార్ హీరో సినిమా అయితే థియేటర్ నిండా, ఊరంతా అభిమానుల బ్యానర్లు, కటౌట్స్, పాలాభిషేకాలు.. రచ్చ రచ్చ ఉంటుంది.

Sreeleela : బాబోయ్ శ్రీలీలకు కూడా బ్యానర్స్ కట్టేశారుగా.. ‘మూవీకి శ్రీలీల స్వీటు.. నువ్వే నా హార్ట్ అంటూ..’

Sreeleela Banner for Guntur Kaaram Movie by fans Photo goes viral in Social Media

Updated On : January 12, 2024 / 9:28 PM IST

Sreeleela : నేడు త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో పండక్కి దూసుకెళ్లిపోతుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. శ్రీలీల గుంటూరు కారం సినిమాలో కూడా తన అందంతో పాటు తన డ్యాన్సులతో మెప్పించింది. ఫస్ట్ హాఫ్ లో అయితే తనతో సపరేట్ డ్యాన్స్ సీక్వెన్స్ కూడా పెట్టారు. శ్రీలీలతో కలిసి మహేష్ బాబు కూడా స్టెప్పులు అదరగొట్టేసాడు. ఇక సెకండ్ హాఫ్ లో కుర్చీ మడతబెట్టి సాంగ్ లో కూడా శ్రీలీల ఎప్పట్లాగే అదరగొట్టేసింది.

సాధారణంగా సినిమా రిలీజ్ అంటే థియేటర్స్ దగ్గర హంగామా, బ్యానర్లు, కటౌట్స్ ఉంటాయి. ఇక స్టార్ హీరో సినిమా అయితే థియేటర్ నిండా, ఊరంతా అభిమానుల బ్యానర్లు, కటౌట్స్, పాలాభిషేకాలు.. రచ్చ రచ్చ ఉంటుంది. హీరోయిన్స్ కి కటౌట్స్, బ్యానర్స్ పెట్టడం చాలా అరుదు. మనకు తెలిసినంతవరకు గతంలో అనుష్క, ఇటీవల సమంతకు కటౌట్స్, బ్యానర్లు పెట్టారు అభిమానులు. ఇప్పుడు మళ్ళీ శ్రీలీలకు బ్యానర్లు పెట్టారు ఆమె అభిమానులు.

గుంటూరు కారం సినిమా రిలీజ్ సందర్భంగా ఓ ఊర్లో శ్రీలీల ఫ్యాన్స్ పెద్ద బ్యానర్ వేయించారు. దానిపై శ్రీలీల ఫోటోలు పెట్టి ఆ బ్యానర్ వేయించిన వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకొని ఓ సరదా కొటేషన్ కూడా రాశారు. గుంటూరు కారం ఘాటు.. మూవీకి శ్రీలీల స్వీటు.. అందుకే నువ్వు నా హార్ట్.. అని రాశారు. శ్రీలీల డై హార్డ్ ఫ్యాన్స్ అని కూడా రాయించారు. చివర్లో మహేష్ ఫోటో కూడా ఒకటి వేశారు. దీంతో ఈ బ్యానర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీలీలకు బ్యానర్ వేయించడం, దాని మీద ఇలాంటి కొటేషన్ రాయడంతో కొంతమంది నవ్వుతుంటే, కొంతమంది ఇదేమి పిచ్చి అంటుంటే కొంతమంది మాత్రం హీరోయిన్స్ కి పెట్టొద్దా బ్యానర్లు అంటున్నారు.

Also Read : Hanuman : మాట నిలబెట్టుకున్న ‘హనుమాన్’ యూనిట్.. అయోధ్యకు విరాళం.. ప్రీమియర్స్‌ షోలతో ఎంతిచ్చారో తెలుసా?

శ్రీలీల వరుస సినిమాలు చేస్తూ తన డ్యాన్సులతో, అందంతో ప్రేక్షకులని మెప్పిస్తుంది. ముఖ్యంగా డ్యాన్స్ తోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆమెకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. అందులో ఇలా బ్యానర్లు వేయించే డై హార్డ్ అభిమానులు కూడా ఉన్నారు. మున్ముందు శ్రీలీలకు కటౌట్లు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదేమో.